తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Election Results: ఘోర పరాజయంపై హరీశ్ రావు, కవితల స్పందన

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ పార్టీ (BRS Party) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), ఆ పార్టీ అగ్ర నాయకులు హరీశ్ రావు (Harish Rao), కవిత (Kavitha) స్వాగతించారు. ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తామని చెప్పి విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఫలితాలపై కవిత, హరీశ్ రావు సామాజిక మాధ్యమాల ద్వారా స్పందించారు.

Also Read అద్భుత పాలన అందిస్తాం: రేవంత్ రెడ్డి

కృతజ్ణతలు
‘ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు. రెండు పర్యాయాలు బీఆర్ఎస్ కు అవకాశమిచ్చిన ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. ప్రజల నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ పాలన సాగాలని కోరుకుంటున్నా. ఈ ఎన్నికల సమరంలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా రేయింబవళ్లు శ్రమించిన మా పార్టీ శ్రేణులకు, ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు. జై తెలంగాణ.. జై కేసీఆర్’
– హరీశ్ రావు, సిద్దిపేట ఎమ్మెల్యే

Also Read కేసీఆర్ ఓటమికి ముఖ్య కారణాలు ఇవే..

కష్టపడ్డ వారందరికీ కృతజ్ణతలు
‘జై కేసీఆర్.. జై బీఆర్ఎస్. కష్టపడి పనిచేసిన బీఆర్ఎస్ కుటుంబానికి కృతజ్ణతలు. పార్టీ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించిన సోషల్ మీడియా బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. అధికారం ఉన్నా లేకపోయినా మనం తెలంగాణ ప్రజల సేవకులం అనే విషయాన్ని మరువద్దు. మన గడ్డ అభివృద్ధి కోసం కృషి చేద్దాం. కోరుట్ల ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. గెలిచిన ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు. తెలంగాణకు దేవుడి దీవెనలు ఉండాలి’
కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button