తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Gurukul: టీజీటీ ఫలితాలు వెల్లడించిన గురుకుల బోర్డు

రాష్ట్రవ్యాప్తంగా గురుకుల సంక్షేమ పాఠశాలలు, కళాశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియను గురుకుల బోర్డు త్వరితంగా పూర్తి చేస్తోంది. గతేడాది నిర్వహించిన పరీక్షల ఫలితాలను విభాగాల వారీగా వరుసగా వెల్లడిస్తోంది. ఇప్పటికే పీజీటీ టీచర్లకు నియామక పత్రాలను అందించింది. డీఎల్, జేఎల్ ఉద్యోగాల కోసం డెమో, సర్టిఫికేట్ వేరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసింది. తాజాగా టీజీటీ పరీక్ష ఫలితాలను నిన్న సాయంత్రం వెల్లడించింది. ఈ ఫలితాలను గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు అధికారిక వెబ్‌సైట్‌‌లో ఉంచింది.

ALSO READ: రాహుల్ విదేశాలకు వెళ్ళిపోతాడు… కాంగ్రెస్‌కు నాయకుడు లేడు: కిషన్ రెడ్డి

గతేడాది ఆగస్టులో గురుకుల విద్యాలయాల పరిధిలో ఉన్నటువంటి 4,020 ట్రైయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ) పోస్టులకు రాత పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షల్లో మెరిట్‌ సాధించిన అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు ఎంపిక చేసింది. ఈ మేరకు ప్రొవిజినల్‌ సెలెక్షన్‌ జాబితాను సంస్థ వెబ్ సైట్‌లో ఉంచింది. ఎంపికైన అభ్యర్థులు తమ విద్యార్హతలు, కులం, చిరునామాను తెలిపే పత్రాలతో రేపు, ఎల్లుండి (సబ్జెక్టుల వారీగా) జరిగే సర్టిఫికేట్ వేరిఫికేషన్‌కు హాజరుకావాలని పేర్కొంది. సర్టిఫికేట్ వేరిఫికేషన్ వేదిక, ఏమేం పత్రాలు తీసుకురావాలన్న వివరాలు గురుకుల వెబ్‌సైట్‌లో ఉంటాయని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button