తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Operation Valentine: యువత ఇలాంటి సినిమాలే చూడాలి.. మెగాస్టార్ చిరంజీవి

మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆపరేషన్ వాలంటైన్’. ఏరియల్‌ వార్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీకి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించారు. ఇందులో మానుషీ చిల్లర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. రుహానీ శర్మ, నవదీప్‌ కీలక పాత్రలు పోషించారు. తాజాగా, ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కారక్రమానికి ముఖ్య అతిథిగా పద్మవిభూషణ్ గ్రహీత, మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సినిమాను ఉద్ధేశించి మనందరిలో దేశభక్తి ఎంత ఉన్నా.. ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ లాంటి సినిమాలు చూస్తే ఆ దేశభక్తి ఉప్పొంగిపోతుంది. ముఖ్యంగా యువత ఇలాంటి సినిమాలు చూడాలన్నారు.

ALSO READ: తేజ సజ్జా నెక్ట్స్ మూవీకి భారీగా రెమ్యునరేషన్ పెంపు

టాలెంట్ ఎవడి సొత్తు కాదు

‘టాప్‌గన్‌’ మూవీ చూసినప్పుడు ఆ విజువల్స్‌కి ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత ఇంత బాగా మనం చేయగలమా? అనిపించింది. కానీ మనవాళ్లు ‘టాప్‌గన్‌’ లాంటి గొప్ప సినిమాని ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ రూపంలో తీశారు. టాలెంట్ ఎవడి సొత్తు కాదు.. మనం ఆ స్థాయిలో చేయగలమని ఈ సినిమా ద్వారా తెలిసింది. ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పుకొచ్చారు. ఈ మూవీని తీయడం యూనిట్‌ బాధ్యత. విజయం అందించి మన రియల్‌ హీరోలైన సైనికులకు నివాళులతోపాటు అంకితం ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉందని హీరో చిరంజీవి అన్నారు.

ALSO READ: రాఘవ లారెన్స్ కీలక నిర్ణయం.. ఖుషీ అవుతున్న ఫ్యాన్స్

ఖర్చు పెడితేనే రిచ్‌నెస్‌ రాదు

ట్రైలర్‌ చూస్తే ఎంతో రిచ్‌నెస్, ఎక్కువ బడ్జెట్‌ మూవీలా కనిపిస్తోంది. డబ్బు ఖర్చు పెడితేనే రిచ్‌నెస్‌ రాదు.. మన ఆలోచనల నుంచి వస్తుంది. ఈ విషయంలో శక్తి ప్రతాప్‌ సింగ్‌ని మన యంగ్‌ డైరెక్టర్స్‌ స్ఫూర్తిగా తీసుకోవాలి. ‘వరుణ్‌ హీరో కావడానికి కారణం నేనే.. కానీ నటుడిగా నన్నెప్పుడూ తను అనుసరించలేదు. తను చేసిన పదమూడు సినిమాల్లో పదమూడు రకాల పాత్రలు చేశాడు.సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్, సందీప్‌ ముద్ద రినైసన్స్ పిక్చర్స్‌పై నిర్మించిన ఈ సినిమా మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్‌ అవుతోంది.

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button