తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Hanu-man: తేజ సజ్జా నెక్ట్స్ మూవీకి భారీగా రెమ్యునరేషన్ పెంపు

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాలతో అలరించిన తేజా సజ్జా..ఇప్పుడు హీరోగానూ రాణిస్తున్నాడు. జాంబిరెడ్డి సినిమాతో హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత చేసిన సినిమాలు నిరాశ చేసిన డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మతో తీసిన ‘హను-మాన్‌’ బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. స్టార్‌ హీరోల సినిమాలను సైతం వెనక్కి నెట్టి బాక్సాఫీస్‌ వద్ద దుమ్ము రేపింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ 300 కోట్ల గ్రాస్‌ వసూళ్లను సాధించింది.

Also Read: రాఘవ లారెన్స్ కీలక నిర్ణయం.. ఖుషీ అవుతున్న ఫ్యాన్స్

ఇక హను-మాన్‌ మూవీ ఊహించిదాని కంటే ఎక్కువ విజయం సాధించడంతో అటు ప్రశాంత్‌ వర్మ.. ఇటు తేజ సజ్జ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. సాధారణంగా హిట్‌ రాగానే హీరోలు తమ పారితోషికాన్ని కొంచెం కొంచెం పెంచేస్తారు. ఇప్పుడు తేజ సజ్జ అదే చేస్తున్నడట. హను-మాన్‌ కోసం కోటి రూపాయలు రెమ్యునరేషన్‌గా తీసుకున్న తేజ.. ఇప్పుడు 5 కోట్లు డిమాండ్‌ చేస్తున్నాడట. ప్రస్తుతం తేజ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పై కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఆ తర్వాత బెజవాడ ప్రసన్న-నక్కిన త్రినాధరావు కాంబినేషన్‌లో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button