తెలుగు
te తెలుగు en English
మరిన్ని

Raghava Lawrence: రాఘవ లారెన్స్ కీలక నిర్ణయం.. ఖుషీ అవుతున్న ఫ్యాన్స్

రాఘవ లారెన్స్.. ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. స్టార్ కొరియోగ్రాఫర్ గా మంచి ఫామ్ లో ఉన్న టైమ్ లోనే నటుడిగా, దర్శకుడిగా మారి మంచి విజయాలు అందుకున్నాడు. అదే సమయంలో సేవా కార్యక్రమలలో పాల్గొని ఎంతో మంచి స్ఫూర్తిగా నిలిచాడు. తన తల్లి పేరుమీద ఛారిటబుల్ ట్రస్ట్ ను మొదలుపెట్టి ఎంతో మంది అనాథలకు, పేదలకు సహాయం అందిస్తున్నాడు. అందుకే ఆయన్ని ఒక సినిమా వ్యక్తిగా కంటే మంచి మనసున్న వ్యక్తిగా ఎక్కువ మంది ఇష్టపడతారు.

Also read: Sundaram Master: పాజిటీవ్ టాక్ తెచ్చుకున్న సుందరం మాస్టర్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

ఇదిలా ఉంటే రాఘవ లారెన్స్ మరో గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే.. ఇటీవల లారెన్స్ చెన్నైలో ఫ్యాన్స్ ను మీట్ అయ్యారట. ఇందులో భాగంగా చాలా మందితో ఫోటో షూట్ కూడా నిర్వహించారట. ఆ హడావుడిలో ఒక అభిమాని ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడట. ఆ సంఘటనతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారట లారెన్స్. అందుకే ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడట. అదేంటంటే.. ఇకనుండి తానే అభిమానులు ఉండే ప్రాంతానికి వస్తానని, తన కోసం ఎవరు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈమేరకు సోషల్ మీడియాలో సుదీర్ఘమైన నోట్ రాసుకొచ్చారు. దీంతో ఆయన ఫ్యాన్, నెటిజన్స్ లారెన్స్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం రాఘవ లారెన్స్ తీసుకున్న డెసిషన్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button