తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Chinarajappa: డివైడర్ పైకి దూసుకెళ్లిన కారు… మాజీ మంత్రి చినరాజప్పకు తప్పిన ప్రమాదం

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. గుంటూరు నుంచి పెద్దాపురంలోని తన స్వగ్రామానికి వచ్చిన సమయంలో ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదం నుంచి చినరాజప్ప క్షేమంగా బయటపడ్డారు. అనంతరం వేరే కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read: దేశంలో అతిపెద్ద కేబుల్ బ్రిడ్జ్… సుదర్శన్ సేత్ ప్రారంభించిన మోదీ

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను టీడీపీ ప్రకటించింది. ఈ జాబితాలో మాజీ మంత్రి చినరాజప్పకు పెద్దాపురం టికెట్ దక్కింది. దీంతో ఆయన అనుచరులు, టీడీపీ కార్యకర్తలు పెద్దాపురంలో ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో దర్గా సెంటర్ వద్ద సడెన్ గా అడ్డువచ్చిన వ్యక్తిని తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. దీంతో కారు ఆ పక్కనే ఉన్న డివైడర్ పైకెక్కింది. ఈ ప్రమాదంలో చినరాజప్ప సహా ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వెంటనే స్పందించిన కార్యకర్తలు చినరాజప్పను బయటకు తీశారు. ఆపై మరో కారులో చినరాజప్ప ఇంటికి వెళ్లిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button