తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

KCR: మాజీ సీఎం కేసీఆర్‌ బర్త్ డేకు కవిత స్పెషల్ విషెస్.. ట్వీట్ వైరల్

ఉద్యమ నాయకుడు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ నేడు 70వ పుట్టినరోజు సందర్భంగా అందరూ ఆయనపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. కొంతమంది వెరైటీగా బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇందులో భాగంగా కేసీఆర్ బర్త్ డే సందర్భంగా కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత స్పెషల్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ALSO READ: ఆరు పరీక్షల ఫలితాలను వెల్లడించిన టీఎస్పీఎస్సీ

నీ జననం ఓ వరం..

‘తెలంగాణకు నీ జననం ఓ వరం విముక్తి కోసం వీరుడు ఉదయించిన తరుణం ఉద్యమ ధీరుడు కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు’ అని కామెంట్ చేశారు. ఈ ట్వీట్‌లో ‘నన్ను నడిపించిన తొలి నేస్తం.. నన్ను తీర్చిదిద్దిన తొలి గురువు.. నా జీవితానికి తొలి హీరో.. నా పోరాటానికి ఉద్యమ స్ఫూర్తి మీరే గుండెల నిండా ప్రేమతో నాన్నకు జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ రాసుకొచ్చిన ఫొటోను షేర్ చేసింది. కాగా, కేంద్ర మంత్రిగా, టీఆర్ఎస్ వ్యవస్థాపకుడిగా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా, రెండు పర్యాయాలు రాష్ట్రానికి సీఎంగా కేసీఆర్ బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button