తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Komatireddy: హరీష్ రావుపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరీష్ రావు ఇటీవల చేసిన వ్యాఖ్యలు కేసీఆర్‌కు వెన్ను పోటు పొడిచేలా ఉన్నాయన్నారు. సీఎం అయ్యేందుకు హరీష్ రావు పెద్ద ప్లాన్ వేస్తున్నారన్నారు. కేసీఆర్‌ను వ్యతిరేకించి వస్తే అందుకు మేము సపోర్ట్ చేస్తామన్నారు.

ALSO READ: వాహనదారులకు బిగ్ అలర్ట్.. భారీ డిస్కౌంట్‌కు ఇవాళే లాస్ట్ డేట్

నాలుగు పార్టీలు ఖాయం..

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తోపాటు కవిత, కేటీఆర్‌, హరీష్ పేర్ల మీద పార్టీ విడిపోతుందని ఎద్దేవా చేశారు. దీంతో రాష్ట్రంలో మరో నాలుగు పార్టీలు పుట్టుకొస్తాయని సెటైర్లు వేశారు. ఎప్పటికైనా హరీష్ రావు పార్టీలో ఉంటే సీఎం కాదు కదా.. బీఆరెస్‌ఎల్పీ లీడర్ కూడా కాలేడన్నారు. ఆయన 20 మందితో ఆ పార్టీ లీడర్ కావాలన్నారు. మరో 20 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button