తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Breaking: సీఎం కేసీఆర్ బస్సులో తనిఖీలు

అసెంబ్లీ ఎన్నికల వేళ పోలీసులు తనిఖీలు (Checking) ముమ్మరం చేస్తున్నారు. ఓటర్లకు (Voters) ప్రలోభ పెట్టేలా మద్యం, డబ్బు, గిఫ్టులు, ఇతర తాయిలాలు ఇచ్చేవారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున తనిఖీలు చేపడుతున్నారు. ఈక్రమంలోనే పార్టీలతో సంబంధం లేకుండా నాయకుల అందరి కాన్వాయ్ లు, కార్లు, బస్సులను ఆపి తనిఖీలు చేస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ (KCR) బస్సులో పోలీసులు సోదాలు చేశారు.

చదవండి: బీజేపీకి వరుస షాక్ లు.. మరో ఇద్దరు కీలక నాయకులు జంప్

ఎన్నికల ప్రచారం సందర్భంగా కరీంనగర్ జిల్లా (Karimnagar District) పర్యటనకు సీఎం కేసీఆర్ వెళ్లారు. మార్గమధ్యలో గుండ్లపల్లి టోల్ గేట్ (Tollgate) దగ్గర పోలీసులు సీఎం కేసీఆర్ ప్రయాణిస్తున్న ‘ప్రగతి రథం’ బస్సును ఆపివేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం మీ బస్సును తనిఖీ చేయాలని చెప్పడంతో సీఎం కేసీఆర్ అంగీకరించారు. బస్సులో తనిఖీలకు సహకరించారు.

ఎన్నికల సంఘం అధికారులు (Election Officers) కేంద్ర బలగాలతో కలిసి తనిఖీలు చేశారు. ప్రతి బ్యాగ్ ను తెరచి పరిశీలించారు. ప్రతి సీటు తీసేసి చూశారు. ఎలాంటి వస్తువులు కనిపించకపోవడంతో బలగాలు కిందకు దిగాయి. అనంతరం కేసీఆర్ యథావిధిగా తన పర్యటనను (Tour) కొనసాగించారు.

చదవండి: కేసీఆర్, మోదీ ‘తోడు దొంగలు’ నాణేలు వైరల్..

కాగా, ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ బిజీబిజీగా ఉన్నారు. రోజుకు 3 నుంచి 5 సభల వరకు పాల్గొంటూ ప్రచారం (Campaign) చేస్తున్నారు. సోమవారం మానకొండూరు, స్టేషన్ ఘన్ పూర్, నకిరేకల్, నల్గొండ నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ ప్రచారం చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button