తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Raids On Pubs: సీఎం రేవంత్ రెడ్డి ఆర్డర్… పోలీసుల నిఘా నీడలో పబ్బులు

హైదరాబాదులో రోజురోజుకు పబ్ కల్చర్ విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా యువత పబ్ కల్చర్ కు బాగా అలవాటు పడిపోయింది. లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన చాలా పబ్బులు మళ్ళీ నడుస్తుండటంతో పబ్బులకు తిరిగి పూర్వ వైభవం వచ్చింది. ఈ కల్చర్ కి బానిసలుగా మారిపోయి యువత తప్పుదోవ పడుతున్నారు. ఇదిలా ఉంచితే హైదరాబాద్‌లో పలు పబ్బులపై పోలీసులు దాడులు చేశారు. జూబ్లీహిల్స్ లోని పబ్స్‌పై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు.

Also Read: పవన్ ఇంటికి చంద్రబాబు.. సీట్లపై సుదీర్ఘ చర్చలు

సీఎం రేవంత్ ఆదేశం

సీఎం రేవంత్, హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల నేపథ్యంలో పబ్‌ల్లో డ్రగ్స్ గంజాయి అమ్మకాలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను మార్చాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్న పోలీసులు.. తనిఖీలతో తమ కార్యాచరణ అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: తెలంగాణ మహిళలకు ఉచిత ప్రయాణం.. ఇలా చేయకపోతే కష్టమే

నిబంధలకు విరుద్దంగా పబ్ లు

నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పబ్ ల పై కొరడా ఝులిపించారు. కరోనా నిబంధనల్ని బేఖాతరు చేస్తున్న పబ్ నిర్వాహకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎటువంటి మాస్కులు ధరించకుండానే పబ్బుకు వచ్చిన వారికి సిబ్బంది సర్వీస్ చేస్తున్నారు. నో మాస్క్ నో ఎంట్రీ అనే విధానానికి స్వస్తి చెప్పేశారు పబ్బుల యజమానులు. దీంతో ఎలాంటి నిబంధనలు పాటించని తబలారస, ఎయిర్ లైవ్, కెమిస్ట్రీ, అమ్నేషియా పబ్బులపై సోదాలు చేసి కేసులు నమోదు చేశారు.

Also Read: మెరుగైన వైద్యసేవలు.. దేశంలోనే నంబర్ వన్

కఠిన చర్యలు తప్పవు

అయితే మరిన్ని పబ్బుల పై కూడా పోలీసులు దాడులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. పబ్బులకు కేటాయించిన టైం వరకు మాత్రమే నడపాలని కచ్చితంగా పబ్బుకు వచ్చేవారికి మాస్కు ఉంటేనే అనుమతించాలని పోలీసులు తెలియజేశారు. బయట ఎక్కువగా తిరిగే వారు కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button