తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Telangana Cabinet: రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. కాంగ్రెస్ గ్యారెంటీలపై చర్చ!

తెలంగాణ కేబినెట్ ఆదివారం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రులు సమావేశం కానున్నారు. రానున్న బడ్జెట్ సమావేశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. దీంతో పాటు బడ్జెట్ సమావేశాల తేదీల ఖరారు అంశం కూడా చర్చకు రానుంది. అయితే ఈసారి పూర్తి బడ్జెట్ కాకుండా.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. సమావేశంలో ఆరు హామీలపై చర్చ జరగనుంది. ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా.. ఉచిత విద్యుత్, రూ. 500 గ్యాస్ సిలిండర్ హామీలు త్వరలోనే అమలులోకి వస్తాయని తెలిపారు. ఈ రెండు అంశాలపై మంత్రివర్గంలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ అంశాలే కాకుండా పలు కీలక అంశాలపై కేబినెట్ చర్చకు అవకాశం ఉంది.

Also read: PM Modi: బీజేపీ అగ్రనేత అద్వానీకి భారతరత్న.. అభినందనలు తెలిపిన ప్రధాని

ఈ నెల 8 నుంచి బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. 9న గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగే అవకాశం ఉంది. 10న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 12 నుంచి 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. ఈసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను అంచనా వేసుకుని పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button