తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Narsapur: సీఎం కేసీఆర్ సభలో కలకలం.. యువకుడి జేబులో బుల్లెట్లు

అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ప్రచార కార్యక్రమాల్లో అసాంఘిక చర్యలు జరుగుతున్నాయి. దుబ్బాక, అచ్చంపేట అభ్యర్థులపై దాడులు సంచలనం రేపగా.. తాజాగా సీఎం కేసీఆర్ (KCR) సభలో బుల్లెట్లు లభించండం తీవ్ర కలకలం రేపాయి. సీఎం భద్రతపై ఆందోళన రేకెత్తుతోంది. మెదక్ జిల్లా (Medak District) నర్సాపూర్ (Narsapur)లో గురువారం నిర్వహించిన ప్రజాశీర్వాద సభలో బుల్లెట్లు కనిపించడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Also Read కాంగ్రెస్ కు అధికారం ఇస్తే 2 లక్షల ఉద్యోగాలు

ఎన్నికల ప్రచారంలో (Election Campaign) భాగంగా సీఎం కేసీఆర్ నర్సాపూర్ వెళ్లారు. సీఎం సభకు భారీ బందోబస్తు నిర్వహించారు. అయితే సంగారెడ్డి జిల్లా (Sangareddy District) రాయికోడ్ గ్రామానికి చెందిన ఎండీ అస్లామ్ (35) ఈ సభకు వచ్చాడు. సభ ప్రాంగణంలోని మీడియా గ్యాలరీలోకి అస్లామ్ ప్రవేశించే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. తన ఐడీ కార్డు చూపించేందుకు అస్లామ్ పర్సు తీయగా దాంతోపాటు రెండు బుల్లెట్లు కనిపించాయి. దీంతో పోలీసులు భయాందోళనతో వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. బుల్లెట్లు (Bullets) స్వాధీనం చేసుకుని వివరాలు తెలసుకున్నారు. సీఎం భద్రతా ఏర్పాట్లలో లోపం స్పష్టంగా తెలిసింది. ఇకపై కేసీఆర్ పర్యటనకు మరింత భద్రత కట్టుదిట్టం చేయాలని పోలీసులు అధికారులు నిర్ణయించారు.

Also Read తమిళనాడులో మరో సంచలనం.. సీఎం స్టాలిన్ కు షాక్

పోలీసుల విచారణలో అతడి గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. చిలప్ చెడ్ మండలం చండూర్ లో అతడి మేనమామ చికెట్ దుకాణంలో పని చేస్తూనే ఓ యూట్యూబ్ చానల్ (Youtube Channer)లో అస్లామ్ విలేకరిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే సీఎం కార్యక్రమం కవరేజీ కోసం సభకు వచ్చాడు. అయితే బుల్లెట్లు ఎక్కడివని ఆరా తీయగా.. 2016లో ఎన్ సీసీ (NCC) శిక్షణలో అస్లామ్ పాల్గొన్నాడు. ఎన్ సీసీ ఫైరింగ్ క్యాంపు వద్ద దొరికిన బుల్లెట్లను దాచుకున్నట్లు అస్లామ్ తెలిపాడు. తనకు ఎలాంటి దురుద్దేశం లేదని, తాను బీఆర్ఎస్, కేసీఆర్ వీరాభిమాని అని పోలీసులతో చెప్పాడు. సామాజిక మాధ్యమాల్లో కూడా కేసీఆర్ కు మద్దతుగా పోస్టులు చేస్తుంటాని వివరణ ఇచ్చుకున్నాడు. పోలీసులు మరింత విచారణ చేపట్టిన అనంతరం అస్లామ్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button