తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Andole: బీజేపీకి వరుస షాక్ లు.. మరో ఇద్దరు కీలక నాయకులు జంప్

అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) వేళ బీజేపీకి వరుసగా షాక్ లు తగులుతున్నాయి. పార్టీకి చెందిన కీలక నాయకులంతా ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి, వివేక్ తదితరులు పార్టీ మారగా తాజాగా మరో ఇద్దరు ఆ పార్టీని వీడారు. వారిలో ప్రముఖ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ (Babu Mohan) కుమారుడు ఉదయ్ బాబు మోహన్, శేరిలింగంపల్లి టికెట్ ఆశించి భంగపడిన మొవ్వా సత్యనారాయణ ఉన్నారు. వారిద్దరు వేర్వేరు చోట గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.

Also Read: స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్కకు బంపరాఫర్

మెదక్ జిల్లాలో (Medak District) కీలక నాయకుడిగా బాబు మోహన్ ఉన్నారు. తన కుమారుడు ఉదయ్ బాబు మోహన్ (Uday Babu Mohan)కు పార్టీ నుంచి టికెట్ ఆశించారు. అయితే బాబు మోహన్ కు ఆందోల్ (Andole) టికెట్ ఇచ్చారు.. కానీ అతడి కుమారుడికి టికెట్ లభించలేదు. కొన్ని వారాలుగా అసంతృప్తితో ఉన్న ఉదయ్ బాబు మోహన్ ఆదివారం బీజేపీని వీడారు. ఆ వెంటనే మంత్రి హరీశ్ రావు (Harish Rao) సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు గులాబీ కండువా వేసి ఉదయ్ బాబు మోహన్ ను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఉదయ్ బాబు మోహన్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి (BRS Party) మద్దతుగా ప్రచారం చేస్తానని తెలిపారు. సీఎం కేసీఆర్ (KCR) ఆధ్వర్యంలో పని చేస్తానని ప్రకటించారు.

Also Read: ఇదే ఊపు ఉంటే డిసెంబర్ 3న ’కాంగ్రెస్‘ విజయం పక్కా

ఇక శేరిలింగంపల్లి (Serilingampally) నియోజకవర్గంలోనూ బీజేపీ కీలక నాయకులు పార్టీని వీడారు. అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడిన మొవ్వా సత్యనారాయణ (Movva Satyanarayana) కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఆధ్వర్యంలో సత్యనారాయణ గులాబీ కండువా కప్పుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button