తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

TS Elections: రెండో రౌండ్‌కే మ్యాజిక్ ఫిగర్.. ఆధిక్యంలో కాంగ్రెస్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు అనంతరం ఈవీఎంలను లెక్కిస్తున్నారు. అయితే మూడు రౌండ్ ఫలితాలు ముగిసే సరికి కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్‌ను దాటింది. దీంతో ఫలితాలపై ప్రధాన పార్టీల నాయకులతో పాటు ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

ALSO READ: కాంగ్రెస్ పార్టీదే గెలుపు.. 9న ప్రమాణస్వీకారం

ఆధిక్యంలో ఉన్న స్థానాలివే?

అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా సాగుతోంది. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ జరుగుతోంది. కాగా, హైదరాబాద్, మెదక్ తప్పా అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ టచ్ చేసింది. మొత్తం 119 స్థానాల్లో కాంగ్రెస్ 67 స్థానాల్లో, బీఆర్ఎస్ 37 స్థానాల్లో, బీజేపీ 11 స్థానాల్లో, ఎంఐఎం 2 స్థానాల్లో, సీపీఐ 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. జిల్లాలవారీగా చూస్తే.. నల్గొండలోని మొత్తం 11 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా.. బీఆర్ఎస్ ఒక్క స్థానంలో ముందంజలో ఉంది. నిజామాబాద్ జిల్లాలో 5 చోట్ల కాంగ్రెస్, రెండు చోట్ల బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఖమ్మంలో కాంగ్రెస్ 9, సీపీఐ ఒక స్థానంలో లీడ్ లో ఉన్నాయి. రంగారెడ్డిలో బీఆర్ఎస్ 4 స్థానాల్లో ముందంజలో ఉండగా.. కాంగ్రెస్ 3 స్థానాల్లో ముందంజలో ఉంది. మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 4 స్థానాల్లో బీఆర్ఎస్, 9 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉండగా.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 8 స్థానాల్లో ముందంజలో ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు స్థానాల్లో బీఆర్ఎస్, నాలుగు స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ నాలుగు స్థానాల్లో ముందంజలో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button