తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

TS Elections: మ్యాజిక్ ఫిగర్ కష్టమే.. బీజేపీకి హంగ్‌ ధీమా!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ గురువారం పూర్తయింది. మొత్తం 119 నియోజకవర్గాల్లో అత్యంత రసవత్తరంగా సాగగా.. ఓటర్లు ఏ పార్టీకి పట్టం కట్టారనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లవనుండగా.. ఎగ్జిట్ పోల్ ఫలితాలు అత్యంత ఆసక్తికరమైన చర్చకు తెరలేపాయి. ఎగ్జిట్ పోల్స్ మాత్రం హస్తం పార్టీ వైపే మొగ్గు చూపగా.. బీఆర్ఎస్ మాత్రం మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని గులాబీ పార్టీ నేతలు భావిస్తున్నారు. కాగా, ఏ పార్టీకి మెజార్టీ రాదని, ఈసారి రాష్ట్రంలో హంగ్ వస్తుందని బీజేపీ నేతలు విశ్వసిస్తున్నారు.

ALSO READ: తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయితీ.. కేంద్రం చర్యలు

మ్యాజిక్ ఫిగర్ డౌటేనా?

అత్యధిక సర్వే సంస్థలు ఈ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 60ని అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ సాధించలేవనే సంకేతాలు ఇవ్వడంతో హంగ్ సర్కార్ అనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ తరుణంలో బీజేపీ సైతం కాంగ్రెస్, బీఆర్ఎస్ మ్యాజిక్ ఫిగర్ వరకు వెళ్లవని చెబుతోంది. ఒకవేళ ఇదే జరిగితే తమ పార్టీ డబుల్ డిజిట్ సీట్లు గెలిచినా కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉందని కమలం పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో తమ పాత్ర కీలకంగా మారనుందని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్‌పైనే చర్చ జరుగుతోంది. అయితే ఈ పోల్స్ ఎంతవరకు నిజమవుతాయే వేచి చూడాలి.

ALSO READ: అధికారం దిశగా కాంగ్రెస్ ఎదగడానికి ప్రధాన కారణాలు ఇవే..

హంగ్ ఏర్పడితే.. ఏంటి?

గ్రేటర్ పరిధిలోనే దాదాపు 9 స్థానాలు, రాష్ట్ర వ్యాప్తంగా మరో 10 స్థానాలు గెలుస్తామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందులో గోషామహల్, ఎల్బీ నగర్, కుత్బుల్లాపూర్, పటాన్ చెరు, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, మహేశ్వరం, అంబర్ పేట, ముషీరాబాద్ స్థానాలు ఉండగా, కరీంనగర్, నిర్మల్, బోథ్, కామారెడ్డి, ముథోల్, హుజూరాబాద్, కోరుట్ల, కల్వకుర్తి, మక్తల్‌తో పాటు ఇతర సెగ్మెంట్లలోనూ గెలిచే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒకవేళ హంగ్ ఏర్పడితే రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఆ తర్వాత కొత్త సర్కార్ ఏర్పాటవుతుందన్నారు. తాము ఎవరికి మద్దతిస్తే వారే గవర్నమెంట్ ఫామ్ చేస్తారని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button