తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

TS Government: 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ పోస్టులు.. అసెంబ్లీలో సీఎం వెల్లడి

నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. త్వరలోనే 15 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామని శుక్రవారం అసెంబ్లీలో ఆయన ప్రసంగించారు. వచ్చే 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేసే బాధ్యత మాదేనని, ఈ మేరకు నోటిఫికేషన్ పై ఎవరికీ అనుమానం అవసరం లేదని స్పష్టం చేశారు. పదే పదే ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయాలని బీఆర్ఎస్ నేతలు గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు.

ALSO READ: మహిళలకు ఉచిత బస్సు కావాలా,వద్దా… హరీష్ రావుపై సీతక్క ఫైర్

అమ్ముకోవడం రాదు..

రాష్ట్రంలో రాచరిక పోకడలు ఉండకూడదన్నదే మా విధానమని సీఎం రేవంత్ అన్నారు. గొప్పలకు పోయి అమలుకు సాధ్యం కానీ హామీలు గుప్పించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరి తమకు కిరాణ దుకాణాల్లో టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాలు అమ్ముకోవడం తమకు తెలియదన్నారు. తాము చిత్తశుద్ధితో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీలు చేపడుతుతామని, అతి త్వరలోనే గ్రూపు-1 నోటిఫికేషన్‌ కూడా ఇస్తామని అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button