తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Polling Holiday: తెలంగాణలో 2 రోజులు బడులు బంద్

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రెండు రోజుల పాటు ప్రభుత్వ పాఠశాలలకు (Govt Schools) సెలవు ప్రకటించారు. ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయుల (Teachers) సేవలు, పాఠశాలల భవనాలు వినియోగించుకుంటుండడంతో ప్రభుత్వం సెలవులు (Holiday) ప్రకటించింది. ఈనెల 30వ తేదీన పోలింగ్ ఉండడంతో ఆ రోజుతో పాటు ముందురోజు కూడా అంటే 29, 30 తేదీల్లో పాఠశాలలకు సెలవులు ఇచ్చారు.

Also Read అర్ధరాత్రి కలకలం.. మధుయాష్కీ నివాసంలో పోలీసుల తనిఖీలు

రాష్ట్రంలో మొత్తం 1.06 లక్షల మంది ఉపాధ్యాయులు (Govt Teachers) ఉండగా వారిలో 80 శాతం మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. ఇక ప్రభుత్వ పాఠశాలలు పోలింగ్ (Polling) కేంద్రాలుగా ఉంటాయి. ఒకరోజు ముందే అన్నీ సిద్ధం చేసుకోవాల్సి ఉండడంతో పోలింగ్ రోజు, అంతకుముందు రోజు సెలవులు ప్రకటించారు. ఈనెల 29న ఉదయం 7 గంటలలోపే ఈవీఎంలను తీసుకునేందుకు ఉపాధ్యాయులు రిపోర్ట్ చేయాల్సి ఉంది. అయితే మరొక రోజు కూడా సెలవు ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

Also Read ఎన్నికల వేళ కేసీఆర్ కు షాక్.. సినిమా ఆగిపోయింది

ఎందుకంటే 30వ తేదీన పోలింగ్ పూర్తయ్యి సమర్పించే వరకు అర్థరాత్రి (Midnight) అవుతుందని.. తర్వాతి రోజు వెంటనే విధుల్లో పాల్గొనడానికి ఇబ్బంది ఉంటుందని గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్, తెలంగాణ ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు తెలిపారు. అందుకే డిసెంబర్ 1న సెలవు ఇవ్వాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button