తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Andhra Pradesh: పోలీసులపై తిరగబడ్డ అంగన్వాడీలు… వీడియో వైరల్

తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు గత కొన్ని రోజుల నుంచి ధర్న చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే వారు విధుల్లో చేరకపోతే తొలగించాలంటూ జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Also Read: ఇద్దరు మహిళలు ఆర్టీసీ బస్సులో ఏం చేస్తున్నారో చూస్తే ఆశ్చర్యపోతారు!

ఏపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ విస్సన్నపేట జాతీయ రహదారిపై సీఐటీయూ కార్యకర్తలతో కలిసి అంగన్వాడీలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. అంగన్వాడీలను పోలీసులు అదుపులోకి తీసుకుంటుండగా.. మహిళా కానిస్టేబుళ్ల పై అంగన్వాడీ కార్య కర్తలు తిరగబడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోను టీడీపీ సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడు ‘ఎక్స్’ వేదికగా షేర్ చేశారు. ‘‘అంగన్వాడీ కార్మికుల తిరుగుబాటు మొదలైంది. మానవత్వం లేని జగన్ పతనం ప్రారంభం అయ్యిందంటూ ఆయన వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button