తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్ప్రత్యేక కథనం

AP Government: ఏపీలో తగ్గిన నిరుద్యోగం.. నాలుగున్నరేళ్లలో భారీగా కొలువులు

ఏపీలో నిరుద్యోగుల కష్టాలకు ఒక పరిష్కారం లభించింది. 2014 నుంచి 19 వరకు ఐదేళ్ల వరకు పాలన సాగించిన టీడీపీ అధినేత చంద్రబాబు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను మరిచి వారిని నిర్లక్ష్యం చేశారు. ఆయన పాలనలో కేవలం 34 వేల 108 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారు. ఇక సీఎం జగన్ నిరుద్యోగుల కష్ట నష్టాలను అంచనా వేసి.. ప్రభుత్వ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో సమగ్ర వివరాలు తెప్పించుకుని వాటిని భర్తీ చేసేందుకు.. అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అందులో భాగంగానే గత నాలుగున్నరేళ్ల పాలనలో రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఖాళీలతో కలుపుకుని సుమారు 6.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశారు. ఇందులో దాదాపు 2.14 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి.

ప్రభుత్వ ఉద్యోగాలు:

గ్రామ, వార్డ్ సచివాలయాల ద్వారా సుమారు లక్ష 25 వేల 110 ఉద్యోగాలు భర్తీ చేశారు. మరోవైపు ఆర్టీసీలో 51 వేల 397 పోస్టులు, వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో 21 వేల 109 పోస్టులు, పాఠశాల విద్యాశాఖలో 6వేల 361 పోస్టులు, ఏపీపీఎస్సీ ద్వారా 3వేల 784 ఖాళీలతో మొత్తం 2 లక్షల 13 వేల 741 ఉద్యోగాలను భర్తీ చేశారు.

Also read: CM Jagan: విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా.. డిజిటల్ విద్యపై సర్కారు దృష్టి

కాంట్రాక్ట్ ఉద్యోగాలు:

మరో వైపు రాష్ట్రంలో దాదాపు 34 వేల 172 మందిని కాంట్రాక్ట్ ఉద్యోగాలకు ఎంపిక చేశారు. అందులో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో 16 వేల 766 పోస్టులు, ఇంధన శాఖలో 7 వేల 694 ఖాళీలు, పశుసంవర్థక, మత్స్య, డెయిరీలో 290 పోస్టులు, ఉన్నత విద్యలో 385, స్కిల్ డెవలప్మెంట్ విభాగంలో 814, వ్యవసాయ, సహకార శాఖలో 2, పౌరసరఫరాలు 116, ఆర్థికశాఖలో 2, మన్సిపల్, పట్టాణాభివృద్ధిలో 11, సాంఘిక సంక్షేమంలో 1, జలవనరులు 1, మహిళా, శిశు సంక్షేమంలో 7, యువజన, క్రీడా సర్వీసుల్లో 3, డీఎస్సీ 2008 ద్వారా 2193 పోస్టులు, డీఎస్సీ 1998 ద్వారా 5887 పోస్టులను భర్తీ చేశారు.

అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు:

ఇక అవుట్ సోర్సింగ్ ద్వారా సుమారు 3 లక్షల 83 వేల 734 ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసింది. అందులో వాలంటీర్స్ వ్యవస్థను ఏర్పాటు చేసి 2 లక్షల 60 వేల 867 ఉద్యోగాలు, ఆప్కోస్ ద్వారా 95 వేల 212 ఉద్యోగాలు, ఆరోగ్య కుటుంబ సంక్షేమంలో 15 వేల 251 పోస్టులు, ఆర్టీసీలో 7001 పోస్టులు, మహిళా శిశు సంక్షేమంలో 3వేల 403, గిరిజన సంక్షేమంలో 525, స్కిల్ డెవలప్మెంట్ 374, పౌరసరఫరాలు 119, ఉన్నత విద్యలో 533, సాంఘిక సంక్షేమం 152 ఇలా మొత్తం 6లక్షల 31 వేల 647 ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button