తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Ayodhya Ram Mandir: అయోధ్యలో అపూర్వ ఘట్టం.. ప్రాణ ప్రతిష్ట ఫోటోలు

ఐదు శతాబ్దాల కోట్లాది మంది కల సాకారమైంది. అయోధ్యలో అపురూప రామ మందిరం ఆవిష్కృతమైంది. రామనామ స్మరణల మధ్య బాల రాముడు ఆలయంలో కొలువుదీరాడు. సరిగ్గా 12.29 నుంచి 12.30 మధ్య కాలంలో ప్రధాని మోదీ చేతులమీదుగా అభిజిత్ లగ్నంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కనులపండువగా కొనసాగింది. గర్భగుడిలో బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించిన తర్వాత విడుదలైన బాల రాముడి ఫోటోలను చూసి భక్తులు మంత్ర ముగ్ధులు అయ్యారు. ఈ మేరకు బాల రాముడికి ప్రధాని మొదటి హారతి సమర్పించారు. మరోవైపు రామ మందిరంలో బాల రాముడి విగ్రహం ప్రాణప్రతిష్ట సందర్భంగా హెలికాప్టర్‌లతో పూల వర్షం కురిపించారు. ఈ సన్నివేశం కూడా మందిర పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ఆకర్షణలో నిలిచింది. కాగా, బాలుడి రూపంలో నిండైన ముఖంతో అమాయకంగా చిరు నవ్వుతో ఉన్న బాల రాముడిని చూసి భక్తులు తన్మయత్వం చెందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button