తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Central Government: సైబర్ భద్రతపై కేంద్రం ఫోకస్.. 1.4 లక్షల ఫోన్ నెంబర్ల బ్లాక్

డిజిటల్ మోసాలను ఎదుర్కోవడంలో భారత ప్రభుత్వం నిర్ణయాత్మక చర్య తీసుకుంది. తాజాగా ఆన్‌లైన్‌లో ప్రజలను మోసం చేయడానికి ఉపయోగించిన 1.4 లక్షల మొబైల్ నంబర్లు, హ్యాండ్‌సెట్లను బ్లాక్ చేసింది. ఆర్థిక సేవల రంగంలో సైబర్ భద్రతపై చర్చించేందుకు ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి నేతృత్వంలో ప్రభుత్వ అధికారులు సమావేశమయ్యారు. అక్రమాలకు ఉపయోగిస్తున్న ఫోన్ నంబర్లను బ్లాక్ చేయడంతో పాటు, ప్రతిష్టాత్మక సంస్థలకు చెందిన అధికారులు వివిధ అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.

Also read: New Railway Line: హైదరాబాద్- విజయవాడ మధ్య కొత్త రైల్వే లైన్.. తగ్గనున్న దూరం

ఫేక్, నకిలీ పత్రాలపై తీసుకున్న మొబైల్ కనెక్షన్లను గుర్తించేందుకు AI-మెషిన్ లెర్నింగ్ ఆధారిత ఇంజన్.. ASTR ను టెలీ కమ్యూనికేషన్ విభాగం అభివృద్ధి చేసింది. బల్క్ మెసెజ్ లు పంపుతున్న 35 లక్షల ప్రిన్సిపల్ ఎంటిటీలను దీని ద్వారా విశ్లేషించింది. దీని ద్వారా ప్రజలను మోసం చేసే మెసెజ్ లు పంపిన వారి నెంబర్లను బ్లాక్, డీయాక్టివేట్ చేసింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 500 కంటే ఎక్కువ అరెస్టులు జరిగాయి. ఏప్రిల్ 2023 నుంచి దాదాపు 3.08 లక్షల సిమ్‌లు, 50,000 IMEIలు, 592 ఫేక్ లింక్‌లు, 2,194 యూఆర్ఎల్ లను బ్లాక్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button