తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

ఫిబ్రవరి 13: చరిత్రలో ఈరోజు

సరోజినీ నాయుడు జయంతి (ఫిబ్రవరి 13, 1879 – మార్చి 2, 1949)

స్వతంత్ర సమరయోధురాలు, కవయిత్రి సరోజినీ నాయుడు 1879 ఫిబ్రవరి 13వ తేదీన జన్మించారు. ఈమె 1925 సంవత్సరంలో అఖిల భారత కాంగ్రెస్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలిగా కూడా కొనసాగారు. భారతదేశపు తొలి గవర్నర్ గా కూడా రికార్డు సృష్టించారు. భారతదేశ చరిత్రలో గొప్ప స్వతంత్ర సమరయోధురాలు గానే కాకుండా… గొప్ప రాజకీయ నాయకురాలిగా కూడా సరోజినీ నాయుడు తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. అంతేకాకుండా ఆమెను నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు.

Also Read: తెలంగాణ అసెంబ్లీ వాయిదా…. ఈరోజు ఏం జరిగిందంటే?

భారతదేశ రాజధానిగా న్యూఢిల్లీ

భారత దేశ రాజధాని గా న్యూఢిల్లీ 1931 ఫిబ్రవరి 13వ తేదీన నిర్ణియించబడింది. ఇక ఇప్పటికీ న్యూఢిల్లీ భారత దేశ రాజధానిగా కొనసాగుతుంది. కాగా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ నుంచే ప్రస్తుతం పరిపాలన సాగిస్తోంది.

పూణే బాంబు దాడి

ఫిబ్రవరి 13, 2010న పూణెలోని జర్మన్ బేకరీలో బాంబు పేలింది. ఈ దాడిలో 18 మంది మరణించగా కనీసం 60 మంది గాయపడ్డారు. దేశాన్ని కుదిపేసిన ఈ దాడిని ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా చేసిందని భారత నిఘా సంస్థలు అనుమానించాయి.

Also Read: బీహార్ అసెంబ్లీలో బలపరీక్ష… వాకౌట్ చేసిన ఆర్జేడీ నాయకులు

ప్రపంచ రేడియో దినోత్సవం

సెప్టెంబరు 2010లో స్పానిష్ రేడియో అకాడమీ అభ్యర్థన తర్వాత యునెస్కో ఒక ప్రకటనను విడుదల చేసింది. ఫిబ్రవరి 13, 2011ని ప్రపంచ రేడియో దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది. యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డు 36వ సెషన్‌లో ఇదే సిఫార్సు చేసింది. 1946లో ఐక్యరాజ్యసమితి రేడియో ఆవిర్భవించిన రోజును ఫిబ్రవరి 13గా నిర్ణయించింది.

మరికొన్ని విశేషాలు

  • 1945 లో మిత్రరాజ్యాల దళాలు రెండవ ప్రపంచ యుద్దం సమయంలో జర్మనీలోని డ్రెస్డెన్ నగరంపై బాంబు దాడిని ప్రారంభించాయి. ఇందులో దాదాపు 22,000 వేల మందికి పైగా మరణించారు. 1960 లో ఫ్రాన్స్ తన మొదటి అణు బాంబును సహారా ఎడారిలో పేల్చింది.
  • 1980లో న్యూయర్క్ లోని లేక్ ప్లాసిడ్‌లో 13వ వింటర్ ఒలింపిక్ క్రీడలు ప్రారంభమయ్యాయి. 1996 లో అమెరికన్ రాపర్ టుపాక్ షకుర్ తన నాల్గవ ఆల్బమ్ ఆల్ ఐజ్ ఆన్ మి ని విడుదల చేశారు. ఇది అతని అత్యుత్తమ హిప్ హాప్ ఆల్బమ్‌గా గుర్తించబడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button