తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

ఫిబ్రవరి 14: చరిత్రలో ఈరోజు

పుల్వామా దాడి

2019 ఫిబ్రవరి 14వ తేదీన దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులను తీసుకెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద… లేతిపుర సమీపంలో కారుతో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ దాడి కారణంగా 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సైనికులు… ఒక ఉగ్రవాది మరణించారు. ఈ దాడికి ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ బాధ్యత వహించారు. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Also Read: అన్నారం, సుందిళ్ల ప్రాజెక్ట్‌ల పరిస్థితి కూడా అంతంత మాత్రమే: రేవంత్ రెడ్డి

వసంత పంచమి

వసంత పంచమి పండుగను ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుక్ల పక్షంలో అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా సరస్వతీ దేవిని భక్తితో పూజిస్తారు. ఈ సంవత్సరం వసంత పంచమి 14 ఫిబ్రవరి 2024న వస్తుంది. భారతదేశంలో వసంత పంచమిని సరస్వతి పూజ అని కూడా పిలుస్తారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈరోజున అక్షరాభ్యాసం చేయిస్తే ఆ సరస్వతీ మాత దివ్యాశీస్సులు ఉంటాయని భావిస్తారు.

వాలెంటైన్స్ డే

క్రీస్తు శకం 270లో మత గురువు వాలెంటైన్ ను ఫిబ్రవరి 14న రోమ్ నగరాన్ని పాలించే క్లాడియస్ అనే రాజు ఉరితీయించాడు. అందువల్ల ప్రతి సంవత్సరం ఆ రోజును వాలెంటైన్స్ డే గా జరుపుకుంటారు. “ప్రేమికుల దినోత్సవం” ఆ రోజున ప్రధానంగా యువతీ యువకులు తాము ప్రేమించిన వారికి, ప్రేమించామనుకునే వారికీ తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. అది ఆయా ప్రేమికుల జీవితంలో ప్రేమ ఉన్నంతకాలం ఒక ప్రత్యేకమైన రోజుగా ఉంటుంది. ఫిబ్రవరి 14 కోసం చాలా మంది యువతీయువకులు ఎదురుచూస్తుంటారు.

Also Read: నా కట్టె కాలే వరకు తెలంగాణ కోసం కొట్లాడుతా: కేసీఆర్‌

బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ (14 ఫిబ్రవరి 1952 – 6 ఆగస్టు 2019)

బీజేపీకి చెందిన ముఖ్య నేతల్లో ఒకరైన సుష్మా స్వరాజ్ ఆ పార్టీలో ఎన్నో కీలక పదవులను అధిరోహించారు. కాగా సుష్మా స్వరాజ్ 1952 ఫిబ్రవరి 14వ తేదీన జన్మించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, కేంద్రమంత్రిగా సుష్మా స్వరాజ్ పనిచేశారు. 1970లో రాజకీయ ప్రవేశం చేసిన సుష్మా స్వరాజ్ విద్యార్థి సంఘం నాయకురాలిగా ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టారు. ఇప్పటికీ రాజకీయాల్లో ఉన్న మహిళ నేతలందరికీ సుష్మా స్వరాజ్ స్ఫూర్తిగా నిలుస్తూ ఉంటారు. సుష్మాస్వరాజ్ ను తెలంగాణ చిన్నమ్మగా పిలుచుకుంటారు.

దామోదర సంజీవయ్య ( 14 ఫిబ్రవరి 1921- 8 మే 1972)

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి, తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య. కర్నూలు జిల్లా, కల్లూరు మండలం పెద్దపాడు గ్రామంలో జన్మించారు. ఉమ్మడి ఏపీ, కేంద్ర ప్రభుత్వంలో కూడా ఎన్నోసార్లు మంత్రి పదవులు చేపట్టారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా నియమింపబడ్డారు. 38 సంవత్సరాల పిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయిన ఘనత ఈయనకే దక్కింది.

Also Read: మణిపూర్ సీఎం సంచలన నిర్ణయం.. అక్రమ వలసదారులను వెళ్లగొడతామంటూ వ్యాఖ్యలు

యూట్యూబ్ ప్రారంభించబడింది

2005లో స్టీవ్ చెన్, చాడ్ హర్లీ, జావేద్ కరీం ప్రముఖ వీడియో షేరింగ్ వెబ్ సైట్ యూట్యూబ్ ను ప్రారంభించారు. దీని ప్రధాన కార్యాలయం అమెరికా కాలిఫోర్నియాలోని శాన్ బ్రూనో అనే నగరంలో ఉంది. నవంబరు 2006లో గూగుల్ సంస్థ దీన్ని 1.65 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఇది గూగుల్ ఉపసంస్థగా పనిచేస్తూ వస్తోంది. ప్రస్తుతం కాలంలో మానవులు ఏది తెలుసుకోవాలన్న ఎక్కువగా యూట్యూబ్ పై ఆధారపడుతున్నారు.

హీరోయిన్ దీక్షా సేథ్ పుట్టినరోజు

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ దీక్షాసేథ్ గురించి తెలియని వారు ఉండరు. ఈ భామ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి జోడిగా వేదం సినిమాలో నటించి టాలీవుడ్ కి పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో మిరపకాయ్, వాంటెడ్, నిప్పు, రెబెల్, ఊకొడతారా ఉలిక్కి పడతారా సినిమాల్లో నటించారు. తమిళ్ లో విక్రమ్ తో రాజా పట్టై నటించారు. 2014లో కపూర్ కుటుంబం వారసుడు అర్మాన్ జైన్ హీరోగా నటించిన లేకర్ హమ్ దివానా దిల్ సినిమాతో హిందీ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. తర్వాత కన్నడలో జగ్గు దాదా సినిమాలో నటించారు.

Also Read: కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్.. ప్రధాని మోడీ ప్రకటన

మరికొన్ని విశేషాలు

  • 1989లొ భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణమైన యూనియన్ కార్బైడ్ భారత ప్రభుత్వానికి 470 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించింది.
  • 1876లో అలెగ్జాండర్ గ్రాహంబెల్ టెలిఫోన్ కోసం పేటెంట్ దరఖాస్తు చేసుకున్నాడు.
  • 1989లో మొదటి జీపీయస్ ఉపగ్రహాన్ని ప్రయోగించారు.

5 Comments

  1. Hey there! This is kind of off topic but I need some guidance from an established blog.

    Is it difficult to set up your own blog? I’m not very techincal but I can figure
    things out pretty fast. I’m thinking about setting up my own but I’m
    not sure where to start. Do you have any points or
    suggestions? Thanks

    Check out my web-site … facebook vs eharmony

  2. Hiya! I know this is kinda off topic nevertheless I’d figured I’d ask.
    Would you be interested in trading links or maybe guest
    writing a blog article or vice-versa? My website goes over a lot of the same topics as yours and I feel we could greatly benefit
    from each other. If you are interested feel
    free to send me an e-mail. I look forward to hearing from
    you! Fantastic blog by the way!

    Feel free to visit my website; eharmony special coupon code

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button