తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

ఫిబ్రవరి 17: చరిత్రలో ఈరోజు

కల్వకుంట్ల చంద్రశేఖరరావు జననం

తెలంగాణ రాష్ట్ర తొలి సీఎం, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు మెదక్ జిల్లాలోని చింతమడకలో 1954 ఫిబ్రవరి 17న రాఘవరావు, వెంకటమ్మ దంపతులకు జన్మించారు. ఈయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధనే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి 2001 ఏప్రిల్ 21న టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యపాత్ర పోషించిన కేసీఆర్.. మొత్తం ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 జూన్‌ 2 నుంచి 2023 జూన్‌ 2 వరకు తొమ్మిది ఏళ్లపాటు రెండు సార్లు తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా పనిచేశారు.

తెలుగు హీరోయిన్ సదా పుట్టినరోజు

సదా.. ఒకప్పుడు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్. ఈమె మహారాష్ట్రలోని రత్నగిరిలో ఒక ముస్లిం కుటుంబంలో జన్మించింది. ‘జయం’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలతో పాటు తమిళ్‌లోనూ నటించింది. తర్వాత 2022లో హలో వరల్డ్‌తో వెబ్ సిరీస్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది.

పాలగుమ్మి పద్మరాజు వర్ధంతి

ప్రముఖ తెలుగు రచయిత పాలగుమ్మి పద్మరాజు వర్ధంతి నేడు. ఈయన 1915 జూన్ 24న జన్మించి, 1983 ఫిబ్రవరి 17న మరణించారు. సినీ రంగంలో మూడు దశాబ్దాల పాటు పలు సినిమాలకు కథలు, పాటలు రాశాడు. తర్వాత ఈయనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. తెలుగులో రచించిన బతికిన కాలేజి, నల్లరేగడి, రామరాజ్యానికి రహదారి, రెండో అశోకుడి మూన్నాళ్ల పాలన వంటి రచనలకు మంచి పేరు వచ్చింది. అదే విధంగా ఎన్నో కథలు రాసినా వాటిలో గాలివాన కథకు బాగా పేరు వచ్చింది.

జిడ్డు కృష్ణమూర్తి వర్ధంతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తత్వవేత్త, ఆధ్యాత్మిక వేత్త, రచయిత, ఉపన్యాసకుడు అయిన జిడ్డు కృష్ణమూర్తి వర్ధంతి నేడు. ఈయన 1986 ఫిబ్రవరి 17న తొంభై ఏళ్ళ వయసులో పాంక్రియాటిక్ క్యాన్సర్ వ్యాధితో మరణించాడు. ఈయన రాసిన ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్ (1954), కృష్ణమూర్తి నోట్‌బుక్ (1976) పుస్తకాలు మంచి ప్రాచుర్యం పొందాయి. ఆయన ప్రసంగాలు, సంవాదాలను ప్రచురించారు. చివరగా అమెరికాలోని ఓహై లోని తన ఇంటిలో చివరి ప్రసంగం చేశాడు. కృష్ణమూర్తి భారతదేశంలో ఐదు పాఠశాలలు, ఇంగ్లండ్‌లో బ్రాక్‌వుడ్ పార్క్ స్కూల్ అని ఒకటి, కాలిఫోర్నియాలో ఓక్ గ్రూవ్ స్కూల్ అనే పేరుతో ఒక స్కూల్ ప్రారంభించాడు.

మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్-2000

కంప్యూటర్ ఆపరేటింగ్ సాఫ్ట్‌వేర్‌ విండోస్‌-2000ను ప్రపంచంలోనే అతి పెద్ద మైక్రోసాఫ్ట్ సంస్థ విడుదల చేసింది. దీనిని 1975లో బిల్ గేట్స్, పౌల్‌ అలెన్‌ అను ఇద్దరు మిత్రులు స్థాపించారు. ఈ సంస్థ వివిధ రకాలైన కంప్యూటర్ పరికరాలు, సాఫ్టువేర్ అభివృద్ధి చేయడం, తయారు చేయడం, లైసెన్స్‌లు ఇవ్వడంతోపాటు సహకారం అందిస్తుంది.

మరికొన్ని అంశాలు

  • ప్రీతం ముండే భారత పార్లమెంట్ సభ్యురాలు జన్మదినం నేడు. ఈమె మహారాష్ట్రలోని బీడ్ లోక్‌సభ స్థానానికి 2014లో జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గెలుపొందింది. ఈ ఎన్నికల్లో 6,96,321 ఓట్ల ఆధిక్యం సాధించి లోక్‌సభ ఎన్నికల్లో సరికొత్త రికార్డును నమోదు చేసింది.
  • అమెరికన్ నటి, గాయని పారిస్ హిల్టన్ 1981లో ఫిబ్రవరి 17న జన్మించింది.
  • బ్రిటీష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిన భారతీయ స్వాతంత్య్ర సమరయోధుడు వాసుదేవ బల్వంత ఫడ్కే వర్ధంతి. ఈయన బ్రిటీష్ సైనికులపై హఠాత్తుగా జరిపిన గెరిల్లా దాడుల్లో పాల్గొన్నాడు.
  • అమెరికన్ బాస్కెట్ బాల్ క్రీడాకారుడు మైఖేల్ జెఫ్రీ జోర్డాన్ 1963లో జన్మించారు. ఈయన అద్భుతమైన జంపింగ్ సామర్థ్యానికి ‘ఎయిర్ జోర్డాన్’ అనే పేరు నామకరణం చేశారు. తర్వాత చరిత్రలో మొదటి బిలియనీర్ అథ్లెట్ అయ్యాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button