తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Fire Accident: బంగ్లాదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 44 మంది మృతి

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఏడు అంతస్తుల ఓ రెస్టారెంట్‌లో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 44 మంది మృతిచెందగా, మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డట్లు అక్కడి పోలీసులు తెలిపారు. నిన్న రాత్రి 9 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు చెప్పారు.

ALSO READ:  మార్చి 3 నుంచి తెలంగాణలో ‘పల్స్ పోలియో’ కార్యక్రమం

పూర్తి వివరాలు.. ఢాకాలోని ‘కచ్చి భాయ్​’ అనే ఏడు అంతస్తుల రెస్టారెంటు నిన్న రాత్రి 9 గంటల సమయంలో కస్టమర్లతో కిక్కిరిసిపోయి ఉంది. అయితే ఏమైందో తెలీదు.. ఉన్నట్టుండి ఒక్కసారిగా మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే ఆ మంటలు ఇతర అంతస్తులకూ వ్యాప్తించాయి. ప్రజలందరూ ప్రాణభయంతో పరుగులు తీశారు. భారీగా ఎత్తున వచ్చిన పొగకు అందరూ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. స్థానికులు పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. 13 ఫైర్​ సర్వీస్​ యూనిట్లు అర్ధరాత్రి వరకు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. 75 మందిని రక్షించారు. గాయాల పాలైన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. అయితే, ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియ రాలేదని, దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button