తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

India: శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితా…. పడిపోయిన భారత్ ర్యాంక్

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్ పోర్టుల జాబితాలో భారత్ ర్యాంకు పతనమైంది. గతేడాదితో పోల్చితే ఒక్క స్థానం పతనమై 84వ ర్యాంకు నుంచి 85వ ర్యాంకుకు పడిపోయింది. ప్రఖ్యాత హెన్లీ పాస్ పోర్టు ఇండెక్స్-2024 నేడు విడుదలైంది. గతేడాది భారత్ పాస్ పోర్టుతో 60 దేశాలకు వీసాతో పని లేకుండా వెళ్లే వీలుండేది. ఈ ఏడాది ఆ సంఖ్య 62 దేశాలకు పెరిగినప్పటికీ, ర్యాంకింగ్స్ లో భారత స్థానం పతనమైంది. భారత పర్యాటకులు వీసా లేకుండానే రావొచ్చంటూ గత కొన్ని నెలల వ్యవధిలోనే ఇరాన్, మలేసియా, థాయ్ లాండ్ దేశాలు కూడా ప్రకటించాయి.

Also Read: అత్తమ్మాస్ కిచెన్… బిజినెస్‌లోకి మెగాస్టార్ ఫ్యామిలీ

ఇక, హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్-2024 జాబితాలో ఫ్రాన్స్ నెంబర్ వన్ గా నిలిచింది. ఫ్రాన్స్ పాస్ పోర్టు ఉంటే 194 దేశాలకు వీసా లేకుండానే వెళ్లొచ్చు. ఈ జాబితాలో జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ కూడా పై వరుసలో ఉన్నాయి. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రపంచవ్యాప్తంగా 199 విభిన్న పాస్‌పోర్ట్‌లు , 227 ప్రయాణ గమ్యస్థానాలను కవర్ చేస్తూ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) ప్రత్యేక డేటా ఆధారంగా గత 19 సంవత్సరాల నుండి ర్యాంకింగ్‌లను అందిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button