తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

International Film Awards 2024: ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’

తమిళ్ స్టార్ ధనుశ్ హీరోగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కెప్టెన్ మిల్లర్’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా కనిపించారు. ఇందులో ధనుశ్ నటనకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు లభించాయి. ఈ చిత్రం రూ. 100 కోట్లు వసూలు చేసి ధనుశ్ కెరీర్‌లో హిట్‌ లిస్ట్‌లో చేరింది. తాజాగా ఈ సినిమా లండన్‌లో జరిగిన ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ 2024లో ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా గుర్తింపు పొందింది.

ALSO READ: ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంలు… ఆసక్తికరంగా మారిన రాజకీయాలు

ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్‌పై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ ఈ సినిమాను నిర్మించారు. జి.వి ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. సిద్దార్థ నూని సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. నాగూరన్ రామచంద్రన్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఇందులో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, అదితి బాలన్, సందీప్ కిషన్, ఎడ్వర్డ్ సోనెన్‌బ్లిక్, జాన్ కొక్కెన్ సహాయక పాత్రల్లో నటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button