తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

ISRO: ఆదిత్య ఎల్‌-1 సక్సెస్.. ప్రధాని మోదీ స్పెషల్ విషెస్

చంద్రయాన్, మంగళయాన్, గగన్‌యాన్‌ వంటి ప్రయోగాలతో భారత్‌ కీర్తిప్రతిష్టలను ప్రపంచ దేశాలకు తెలియజేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తాజాగా మరోసారి భారత సత్తాను చాటిచెప్పింది. సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు గానూ ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్-1 ప్రయోగం సక్సెస్ సాధించింది. ఎట్టకేలకు ఆదిత్య ఎల్‌-1 శాటిలైట్‌ను ఇస్రో శనివారం విజయవంతంగా హాలో ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టింది. కాగా, సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు తొలిసారిగా భారత్ గతేడాది సెప్టెంబర్‌ 2న నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య ఎల్‌-1 127 రోజులపాటు సుదీర్ఘంగా ప్రయాణించి 1.5 మిలియన్‌ కిలోమీటర్ల దూరంలో ఉన్న గమ్యస్థానానికి చేరింది.

ALSO READ: రాముడి పై సాంగ్… X లో షేర్ చేసిన ప్రధాని మోదీ

ఐదేళ్ల పాటు సేవలు

ఆదిత్య ఎల్-1 ప్రయోగం సూపర్ సక్సెస్ కావడంతో ప్రధాని మోదీ ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపారు. ‘భారత్ మరో మైలురాయిని సృష్టించింది. దేశ మొదటి సోలార్ అబ్జర్వేటరీ ఆదిత్య-ఎల్1 దాని గమ్యాన్ని చేరుకుంది. అత్యంత సంక్లిష్టమైన, సంక్లిష్టమైన అంతరిక్ష యాత్రలను గ్రహించడంలో మన శాస్త్రవేత్తల అంకితభావానికి ఇదే నిదర్శనం. ఈ అసాధారణ ఫీట్‌ని ప్రశంసించడంలో నేను దేశంతో కలిసి ఉన్నా. మానవాళి ప్రయోజనం కోసం మేం సైన్స్ కొత్త సరిహద్దులను కొనసాగిస్తాం’. అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాగా, లాగ్రాంజ్ పాయింట్ భూమి-సూర్యుడి మధ్య గురుత్వాకర్షణ సమానంగా ఉంటుంది. దీంతో ఇక్కడి నుంచే పరిశోధనలు చేపట్టేందుకు ఇస్రో మిషన్‌ను చేపట్టింది. అదే విధంగా ఈ ఆదిత్య ఎల్-1 శాటిలైట్ ఐదేళ్ల పాటు సేవలు అందించనుంది. ఆదిత్య ఎల్‌-1 ప్రయోగం విజయవంతం కావడంతో అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాల్లో మునిగితేలుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button