తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

ISRO: మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. రేపు నింగిలోకి జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–14 రాకెట్‌

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఖాతాలో మరో కలికితురాయి చేరనుంది. నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మరో ప్రయోగానికి సిద్ధమైంది. షార్‌ కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి రేపు సాయంత్రం 5.35 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–14 రాకెట్‌ను ప్రయోగించేందకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. ఇవాళ మధ్యాహ్నం 2.05 గంటల నుంచి 27.30 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–14 రాకెట్‌ను ప్రయోగిస్తారు. మొత్తం 2,272 కిలోలు బరువు కలిగిన ఇన్‌శాట్‌–3 డీఎస్‌ ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టేలా ఈ ప్రయోగాన్ని రూపొందించారు.

ALSO READ: ప్రపంచానికే ఆదర్శం.. యువ సైన్యమే మన వాలంటీర్ వ్యవస్థ

వాతావరణానికి సంబంధించిన ప్రతి సమాచారాన్ని ఇది భూమికి చేరవేయనుంది. దీంతో మెరుగైన వాతావరణ సూచనలు అందుబాటులోకి రావడంతో పాటు విపత్తు హెచ్చరికల ద్వారా మనల్ని అప్రమత్తం చేస్తుంది. ప్రకృతి విపత్తుల సమయంలో ముందస్తుగా సమాచారం తెలుసుకునే అత్యాధునిక సాంకేతిక వ్యవస్థతో కూడిన 19 పేలోడ్‌లను కూడా ఇందులో పంపుతున్నారు. భూమి, సముద్ర ఉపరితలాల పర్యవేక్షణకు కూడా ఈ ప్రయోగం ఉపయోగపడనుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఈ ప్రయోగానికి అవసరమైన నిధులను సమకూర్చింది.

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button