తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

ISRO: జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌14 ప్రయోగం సక్సెస్​

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగం చేపట్టింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ప్రయోగించిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌14 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. ఈ ఉపగ్రహం ఇవాళ సాయంత్రం 5.35 గంటలకు ప్రయోగించగా.. మూడు దశలను దాటుతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ వాహకనౌక 2,275 కిలోల బరువు గల వాతావరణ ఉపగ్రహం ఇన్‌శాట్‌-3డీఎస్‌ను నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టింది. కాగా, ఈ ఉపగ్రహం పదేళ్ల పాటు సేవలందించనుందని ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్ ప్రకటించారు.

ALSO READ: కాళేశ్వరం పాపం వారిదే.. సీఎం రేవంత్ ఫైర్

వాతావరణ అంచనా, విపత్తుల నిర్వహణ..

ప్రస్తుతం అంతరిక్షంలో ఇన్‌శాట్‌–3డీ, ఇన్‌శాట్‌–3డీఆర్‌ అనే రెండు థర్డ్ జనరేషన్ ఉపగ్రహాలు ఉన్నాయి. ఈ ఉపగ్రహాలకు కొనసాగింపుగా ఇన్‌శాట్‌–3డీఎస్‌ని పంపుతున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఈ ఉపగ్రహంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ‘6 చానెల్ ఇమేజర్’, ‘19 చానెల్ సౌండర్, ‘డాటా రిలే ట్రాన్స్ పాండర్’, ‘సెర్చ్ అండ్ రెస్క్యూ ట్రాన్స్ పాండర్’ అనే పేలోడ్లు ఉన్నాయి. ఇది స్పేస్​లోకి చేరితే వాతావరణ అంచనా, విపత్తుల నిర్వహణ అంశాల్లో ఇండియా కెపాసిటీ మరింతగా పెరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button