తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

ISRO: మరో కీలక ప్రాజెక్టుకు ఇస్రో సిద్ధం.. ఈనెల 17న రాకెట్ ప్రయోగం

తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. వాతావరణానికి సంబంధించి ప్రతి క్షణం సమాచారాన్ని అందించే వాతావరణ ఉపగ్రహం ఇన్సాట్- 3 డీఎస్‌ను ఇస్రో ప్రయోగించనుంది. ఈ ఉపగ్రహం సహాయంతో మెరుగైన వాతావరణ సూచన అందుబాటులోకి రావడంతో పాటు విపత్తు హెచ్చరికలకు కూడా ఉపకరిస్తుంది. ఈ ఉపగ్రహాన్ని ఫిబ్రవరి 17న శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనుంది. ఈ ఉపగ్రహం జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (GSLV) F14 రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నారు.

Also read: WhatsApp: వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఏది కావాలన్నా పొందొచ్చు

షార్‌లో జీఎస్ఎల్వీ – ఎఫ్‌ 14 రాకెట్‌ ప్రయోగానికి రెండో ప్రయోగ వేదిక వద్ద ఇప్పటికే రెండు దశల అనుసంధాన పనులు పూర్తి కాగా మూడో దశ పనులు జరుగుతున్నాయి. ప్రకృతి విపత్తుల సమయంలో ముందస్తుగా సమాచారం తెలుసుకునే అత్యాధునిక సాంకేతిక వ్యవస్థతో కూడిన 19 పేలోడ్‌లను కూడా పంపుతున్నారు. ఈనెల 17న సాయంత్రం 5. 30 గంటలకు రాకెట్ ప్రయోగం జరగనుంది. జీఎస్‌ఎల్వీ మూడు దశల లాంచ్ వెహికిల్ అని, ఇది 51.7 మీటర్ల పొడవు, 420 టన్నుల బరువు ఉంటుందని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు.

One Comment

  1. Hey there I am so delighted I found your weblog, I really found you by
    mistake, while I was researching on Digg for something else, Anyhow I
    am here now and would just like to say thanks for a remarkable post and a
    all round thrilling blog (I also love the theme/design), I
    don’t have time to browse it all at the minute but I have book-marked it and also included your
    RSS feeds, so when I have time I will be back to read much more, Please do keep up the superb
    b.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button