తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Jagan: వైసీపీ ఎమ్మెల్సీలతో వైఎస్‌ జగన్‌ కీలక సమావేశం

మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ వైసీపీ ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. త్వరలో శాసనసభ, శాసనమండలి సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారికి దిశానిర్దేశం చేశారు. 40 శాతం మంది ప్రజలు మన వైపు ఉన్నారని మర్చిపోవద్దన్నారు. మనం చేసిన మంచి ఇప్పటికీ ప్రజలకు గుర్తుందని వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాలు శకుని పాచికల మాదిరిగా ఉన్నాయన్నారు. ఈవీఎంల వ్యవహారంపై దేశవ్యాప్త చర్చ జరగాలన్నారు. మనకు కష్టాలు కొత్త కాదని.. ప్రలోభాలకు లొంగకుండా ప్రజల తరఫున పోరాడదామన్నారు.

ALSO READ: నీట్ పరీక్షపై కేంద్రం కీలక నిర్ణయం

మరోవైపు ఓటమి బాధలో ఉన్న నేతల్లో జోష్ నింపేందుకు జగన్‌ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. గత మూడు, నాలుగు రోజులుగా వైసీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు, గెలిచిన అభ్యర్థులు, కీలక నేతలతో ఎన్నికల ఫలితాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాల్లోనే విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 25 ఎంపీ స్థానాలకు గానూ కేవలం 4 స్థానాల్లోనే ఆ పార్టీ గెలుపొందిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button