తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

January 01: చరిత్రలో ఈరోజు.. మరపురాని రోజు నేడు

01-01-2024

నూతన సంవత్సరం

గ్రెగోరియన్ క్యాలెండర్‌లో , అనేక దేశాలలో ఓల్డ్ ఇయర్స్ డే లేదా సెయింట్ సిల్వెస్టర్స్ డే అని కూడా నూతన సంవత్సరాన్ని పిలుస్తుంటారు. సంవత్సరంలో చివరి రోజు అయిన డిసెంబర్ 31 ని “న్యూ ఇయర్స్ ఈవ్” గా సూచిస్తారు. నూతన సంవత్సర వేడుకలు సాధారణంగా డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి జనవరి 1 వరకు జరుగుతాయి.

Also Read కొత్త ఆశలతో స్వాగతం.. ఘనంగా కొత్త సంవత్సర వేడుకలు

ముంబై కన్నీరు
1978లో కొత్త సంవత్సరం రోజే భారతదేశంలో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. జనవరి 1న ముంబై నుంచి దుబాయ్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం-855 ప్రమాదానికి గురయ్యింది. ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరిన మూడు కిలోమీటర్ల తర్వాత ఆరేబియా సముద్రంలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో మొత్తం 213 మంది మృత్యువాత చెందారు.

చైనా ఆవిర్భావం
1 జనవరి 1911న రాజరికం నుంచి ప్రజా గణతంత్ర రాజ్యంగా చైనా ఆవిర్భవించింది. 2,132 సంవత్సరాల పాటు కొనసాగిన ‘మోనార్కీల’ పాలనపై ప్రజలు తిరగబడ్డారు. చైనా స్వాతంత్ర్యం కోసం జరిగిన ఉద్యమానికి ‘జిన్ హాయ్ విప్లవం’ లేదా ‘హిన్ హాయ్ విప్లవం’ అని పిలుస్తారు. కొత్త సంవత్సరం నాడు రాజరికం నుంచి విముక్తి పొంది చైనా స్వేచ్ఛా వాయులు పీల్చుకుంది. కానీ చైనీయులు ఈరోజును కాకుండా అక్టోబర్ 1న స్వాతంత్ర దినోత్సవాన్ని చేసుకుంటారు.

Also Read భారత్ కంటే ముందే న్యూ ఇయర్ జోష్‌.. ఏయే దేశాలంటే?

ప్రపంచ కుటుంబ దినోత్సవం
అంతర్జాతీయ కుటుంబ దినోత్సవంగా జనవరి 1వ తేదీని పరిగణిస్తారు. కుటుంబానికి ఒక రోజు కేటాయించాలనే ఉద్దేశంతో ప్రపంచ ఐక్య రాజ్య సమితి ప్రతియేటా జనవరి 1వ తేదీని కుటుంబ దినోత్సవంగా ప్రకటించింది. శాంతి సౌభ్రాతృత్వంతో కుటుంబసభ్యులతో గడపాలనే సందేశంతో ఐరాస ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని సూచించింది.

హ్యాంగోవర్ డే
కొన్ని దేశాల్లో ఈరోజును హ్యాంగోవర్ డేగా పరిగణిస్తారు. పాశ్చాత్య దేశాల్లో ఆంగ్ల నూతన సంవత్సరాన్ని ఘనంగా చేసుకుంటారు. డిసెంబర్ 31న అర్ధరాత్రి వరకు ప్రజలు పార్టీల్లో మునిగి తేలుతారు. మద్యం సేవిస్తూ విందు ఆరగిస్తూ పాటలు పాడుతూ.. డ్యాన్స్ లు చేస్తూ ఎంజాయ్ చేస్తారు. మరుసటి రోజు అంటే జనవరి 1న వారు అలసిపోయి తలపట్టుకుని ఉంటారు. అందుకే హ్యాంగోవర్ డేగా చెబుతారు.

మణిపూర్ రాష్ట్ర అవతరణ
ఈశాన్యభాగాన ఉన్న ఒక రాష్ట్రం మణిపూర్. దీని రాజధాని ఇంఫాల్. ఇది 1972 జనవరి 1న మణిపూర్‌ను ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. మణిపూర్‌లో మెయితీ తెగకు చెందినవారు అధికంగా ఉంటారు. ఒకప్పుడు థాయ్‌లాండ్, బర్మాల గొడవల మధ్య మణిపూర్, అస్సాంలు ఇరుక్కున్నాయి. బెంగాల్‌ను పరిపాలిస్తున్న బ్రిటిష్‌ ప్రభుత్వం కలుగజేసుకొని 1891లో అస్సాం, మణిపూర్‌ను బర్మా నుండి జయించి భారతదేశంలో కలుపుకుంది.

ఇక జనవరి 1వ తేదీన ప్రముఖ హీరోయిన్లు సోనాలి బింద్రే, విద్యా బాలన్, ఊహ, ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ జన్మించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button