తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Job Notification: మున్సిపల్ శాఖలో ఉద్యోగాలు.. జీతం లక్ష రూపాయాలు

తెలంగాణ మున్సిపల్ శాఖ పరిధిలోని హెచ్‌ఎండీఏ, మూసీ రివర్‌ఫ్రంట్‌తో పాటు టీయూఎఫ్‌ఐడీసీలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మూడు విభాగాల్లో లీగల్ స్పెషలిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. దరఖాస్తులు ఫిబ్రవరి 29 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. https://www.nium.org.in/ వెబ్‌సైట్‌కి వెళ్లి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

Also read: Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. 11 మంది సజీవదహనం

నోటిఫికేషన్ లో భాగంగా కాంట్రాక్టు ప్రాతిపదికన ఏడాది కాలానికి పనిచేసేందుకు లీగల్ స్పెషలిస్ట్ ఖాళీలు.. హెచ్ఎండీఏలో 1 పోస్టు, మూసీ రివర్ ఫ్రంట్ లో 1 పోస్టు, టీయూఎఫ్ఐడీసీ లో 1 పోస్టును భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. లక్ష జీతం చెల్లించనున్నారు. అభ్యర్థులు ఎల్ఎల్ఎం పూర్తి చేసి ఉండాలి. అలాగే న్యాయ రంగంలో 10 ఏళ్ల అనుభవం ఉండాలి. పట్ణణ చట్టాలపై అవగాహన ఉండాలి. పనితీరును బట్టి ఉద్యోగ సమయం పొడిగించనున్నారు. ఫిబ్రవరి 29 వరకు దరఖాస్తులు చేసుకునేందుకు గడువు విధించారు. అలాగే షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button