తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం
Trending

జూన్ 17: చరిత్రలో ఈరోజు

ప్రపంచ ఎడారీకరణ, కరువు వ్యతిరేక దినం

ప్రపంచ కరువు వ్యతిరేక దినోత్సవాన్ని నేడు పాటిస్తారు. ఏడారీకరణ, కరువును ఎదుర్కోవడానికి 1995లో తొలిసారిగా ఈ రోజును నిర్వహించారు. 1994లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ జూన్ 17ని ఏడారీకరణ, కరువు వ్యతిరేక దినంగా ప్రకటించింది.

విశాఖ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు

విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ, విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (వుడా) 1978లో ఏర్పడింది. ఇది ప్రస్తుతం ఉన్న విశాఖ నగరాభివృద్ధిని విస్తరించడం ద్వారా ఏర్పడింది. ప్రస్తుతం విశాఖ మహానగరపాలక సంస్థ, దాని శివారు ప్రాంతాలతో కలుపుకుని ఉంది.


రాజీవ్ గాంధీ, సర్దార్
వల్లభాయి పటేల్‌లకు భారతరత్న

భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ కు 1991లో మరణానంతరం భారత ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది.

లియాండర్ పేస్ పుట్టినరోజు

భారతీయ టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్ 1973 కోల్ కతాలో జన్మించారు. డేవిస్ కప్ లో డుబుల్స్ లో అత్యధిక సార్లు విజేతగా నిలిచిన రికార్డు ఆయన పేరిట ఉంది. 8 సార్లు డబుల్స్, 10 సార్లు మిక్సిడ్ డబుల్స్ లో గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించాడు.

ఝాన్సీ లక్ష్మీబాయి మరణం

భారత స్వాతంత్య్ర సమరయోధురాలు ఝాన్సీ లక్ష్మీబాయి 1858 గ్వాలియర్ లో వీరమరణం పొందారు. ఉత్తర భారతదేశంలో ఝూన్సీ అనే రాజ్యానికి రాణిగా పాలన చేశారు. 1857 లో బ్రిటిష్ పరిపాలనను అడ్డుకున్న వారికి ఈమె గుర్తుగా నిలిచారు. దేశ చరిత్రలో ‘జోన్ ఆఫ్ ఆర్క్’గా నిలిచిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button