తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Viral వీడెవడో మాక్స్ వెల్ ను మించినోడు! ఎలా కొట్టినా ఫోర్లు, సిక్స్ లే

భారత గడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ ప్రేక్షకులను రంజిపజేస్తోంది. సంచలనాలకే సంచలనాలు.. రికార్డుల మీద రికార్డులు నమోదవుతున్నాయి. ప్రస్తుత మెగా టోర్నీలో (ICC World Cup) శ్రీలంక మీద ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ ఆటనే హైలెట్. జట్టు కుప్పకూలిన వేళ మాక్స్ వెల్ (Glen Maxwell) ఆడిన తీరు యావత్ ప్రేక్షకులను నివ్వెరపరిచింది. శరీరం సహకరించకున్నా నిలబడ్డ చోట నుంచే సిక్స్ లు.. ఫోర్లు బాదుతూ ఆస్ట్రేలియాకు (Australia) చిరస్మరణీయ విజయం అందించాడు. ఆ మ్యాచ్ లో మ్యాక్స్ వెల్ ఆడినట్టుగానే ఓ బుడ్డోడు సిక్స్ ల మీద సిక్స్ లు బాదుతున్నాడు. మాక్స్ వెల్ ను మించి పడుకుని.. నిలబడి.. వెనక్కి తిరిగి మరీ బ్యాటింగ్ (Batting) చేసిన వీడియో వైరల్ గా మారింది. బంతి మీద పగబడ్డట్టు ఇష్టమొచ్చినట్టు బ్యాట్ (Bat)తో బాదుతున్న వీడియో నవ్వులు తెప్పిస్తోంది.

Read Also కోహ్లీ-అనుష్క ఆస్పత్రికి ఎందుకు వెళ్లారు? మరో గుడ్ న్యూస్ ఉంటుందా?

ఎక్కడి వీడియోను తెలియదు కానీ ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఓ బాలుడు (Boy) క్రికెట్ ఆడుతున్నాడు. బౌలర్ వేస్తున్న ప్రతి బంతిని ఫోర్ (Four), సిక్స్ (Six)గా మలుస్తున్నాడు. అది సాదాసీదా కాదు పడుకుని.. నిలబడి.. వెనక్కి తిరిగి బ్యాట్ తో రఫ్ఫాడించాడు. అంతటితో ఆగకుండా కాలితో తన్నుతూ.. ఇక చివరికి వికెట్ తీసి దానితో కూడా సిక్స్ బాదాడు. అతడు ఆడుతుంటే వెనుకాల మ్యాచ్ కామెంట్రీ రావడంతో వీడియో మరింత ఆసక్తికరంగా మారింది. వీడియోలో ఉన్న దృశ్యాలు చూస్తుంటే మనదేశంలో కానట్టుగా కనిపిస్తోంది. ఎక్కడైతే ఏమీ కుర్రాడు అద్భుతంగా ఉందని నెటిజన్లు అభినందిస్తున్నారు. పెద్దయ్యాక మంచి క్రికెటర్ (Cricketer) అవుతాడని కామెంట్లు చేస్తున్నారు.

Read Also Glass Symbol పవన్ కల్యాణ్ కు ఈసీ షాక్.. గ్లాస్ గుర్తు పాయే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button