తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

మార్చి 19: చరిత్రలో ఈ రోజు

జీన్ ఫ్రెడెరిక్ జననం

జీన్ ఫ్రెడెరిక్ జోలియట్ ప్రముఖ ఫ్రెంచ్ శాస్త్రవేత్త. 1900లో ఫ్రాన్స్ జన్మించిన ఈయన భౌతిక శాస్త్రంలో ఎన్నో పరిశోధనలు చేశారు. ప్రేరేపిత రేడియోధార్మికత ఆవిష్కరణకు గానూ నోబెల్ బహుమతి అందుకున్నారు. ప్యారిస్ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్‌లో లెక్చరర్‌గా ఉన్నప్పుడు, ఫ్రెడెరిక్ తన భార్య క్యూరీతో కలిసి పరమాణువు నిర్మాణంపై పరిశోధన చేశారు. ప్రత్యేకించి ఇతర కణాల ద్వారా తాకిన న్యూక్లియైల ప్రొజెక్షన్ లేదా రీకోయిల్‌పై పరిశోధన చేశారు. 1935లో ప్రేరేపిత రేడియోధార్మికతను కనుగొన్నందుకు వీరికి రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది.

మంచు మోహన్ బాబు జననం

మోహన్ బాబు టాలీవుడ్‌లో ప్రముఖ నటుడు, నిర్మాత. ఈయన చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలం మోదుగులపాళెంలో 1952లో జన్మించారు. స్వర్గం-నరకం (1975) చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన మోహన్ బాబు.. తన విలక్షణ నటనతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. ఇప్పటివరకు 573 సినిమాల్లో నటించారు. 72 సినిమాలు నిర్మించారు. విలన్‌గా, క్యారెక్టర్‌ నటుడిగా, హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఆయన కళాప్రతిభకు 2007లో పద్మశ్రీ పురస్కారం లభించింది. రాజకీయాల్లోకి ప్రవేశించి రాజ్యసభ సభ్యుడిగా ఒక పర్యాయం పదవిని అలంకరించారు.

ఆచార్య జె. బి. కృపలానీ మరణం

జె. బి. కృపలానీ సుప్రసిద్ధ స్వాతంత్య్ర సమరయోధుడు, భారత రాజకీయ నాయకుడు. సింధు (నేటి పాకిస్తాన్) ప్రాంతంలోని హైదరాబాదులో 1888లో జన్మించారు. 1920లో సహాయ నిరాకరణోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినపుడు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షునిగా ఉన్నారు. మహాత్మా గాంధీకి అత్యంత సన్నిహితులలో ఒకరిగా పేరుగాంచారు. గుజరాత్, మహారాష్ట్రలోని గాంధీ ఆశ్రమాలలో సంఘ సంస్కరణ, విద్యా సంబంధ విషయాలపై కృషిచేశారు. 1982లో తుదిశ్వాస విడిచారు.

రఘువరన్ మరణం

దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ నటుడు రఘువరన్. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ చిత్రాల్లో నటించారు. మొత్తం దాదాపు 150 సినిమాల్లో నటించారు. ప్రతినాయక పాత్రల్లో రఘవరన్ అద్భుతంగా నటించేవారు. ఈయన స్వస్థలం కేరళ రాష్ట్రం, పాలక్కాడ్ జిల్లా కోలెంగూడె. రఘువరన్ 2008లో చెన్నైలో తుదిశ్వాస విడిచారు.

మరికొన్ని విశేషాలు:

1831: అమెరికాలో మొదటి బ్యాంక్ దోపిడీ జరిగింది. న్యూయార్క్‌లోని సిటీ బ్యాంక్‌లో $245,000 దోపిడీ జరిగింది.

1911: సోషలిస్ట్ జర్మన్ రాజకీయవేత్త క్లారా జెట్కిన్ మొదటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని స్థాపించారు.

1990: కెనడా రాజధాని ఒట్టావాలో తొలిసారిగా మహిళల ఐస్ హాకీ పోటీలు జరిగాయి.

1998: బీజేపీ నేత అటల్ బిహారీ వాజ్‌పేయి రెండోసారి ప్రధాని అయ్యారు.

5 Comments

  1. Hey there! I know this is kind of off-topic however I had to ask.

    Does running a well-established blog such as yours take a massive amount work?

    I am completely new to operating a blog however I do write in my diary everyday.
    I’d like to start a blog so I can share my experience and
    thoughts online. Please let me know if you have any kind of ideas or tips
    for new aspiring blog owners. Appreciate it!

    Here is my web blog vpn special code

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button