తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Petro Price: ఈసారి ప్రజలకు నిరాశే.. పెట్రో ధరలపై కేంద్రం కీలక ప్రకటన

కొత్త సంవత్సరం సందర్భంగా ప్రజలకు శుభవార్త వినిపిస్తుందని అనుకుంటే కేంద్ర ప్రభుత్వం నిరాశే మిగిల్చింది. రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల నుంచి ఉపశమనం లభిస్తుందని భావిస్తే అలాంటిదేమీ లేదని తెలిసింది. పెట్రో ధరలు తగ్గించడం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ప్రకటనతో ప్రజలు నిరాశకు లోనయ్యారు.

Also Read తెలంగాణలో సోనియా పోటీ? ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీపేనా?

అంతర్జాతీయంగా చమురు ధరలు తక్కువ ఉండడంతోపాటు లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తుందని సర్వత్రా చర్చ జరిగింది. దాదాపు రూ. పది వరకు ధర తగ్గుతుందనే వార్తలు వినిపించాయి. పెట్రో ధరల తగ్గింపుపై కేంద్ర పెట్రోలియం శాఖ ప్రభుత్వానికి నివేదిక కూడా పంపించిందని ప్రచారం జరిగింది. పెట్రో ధరలు తగ్గుతాయనే వార్తలతో ప్రజలు ఆనందంలో మునిగి తేలారు. కానీ వారి ఆనందం ఆవిరైపోయింది. పెట్రో ధరలపై పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి బుధవారం కీలక ప్రకటన చేశారు.

Also Read ‘కాంగ్రెస్ 420 హామీలు’ బుక్ లెట్ విడుదల చేసిన బీఆర్ఎస్ పార్టీ

‘అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఆ పరిస్థితిలో మార్పు (స్థిరత్వం) వచ్చే వరకు ధరల తగ్గింపునకు అవకాశం లేదు. ఈ విషయంలో దేశీయ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలతో ఎటువంటి చర్చలు జరగలేదు. రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం చమురు ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగి మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ఈ సమయంలో తగినంత చమురు లభ్యత, ధరలను స్థిరంగా ఉంచడమే మా ప్రధాన లక్ష్యం’ అని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button