తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

New Rule: షాపులపై ఇక కొత్త నిబంధన.. కీలక సూచనలు జారీ

శాంతిభద్రతలను పరిరక్షించే ప్రయత్నంలో, షాద్ నగర్ పై ప్రత్యేక దృష్టి పెట్టి, సైబరాబాద్ ప్రాంతంలో ‘హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ 21/76’ని అధికారులు పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సంస్థలు, దుకాణాలకు కీలక సూచనలు జారీ చేస్తున్నారు.

Also read: Onion Prices: ఉల్లిపై కేంద్రం చర్యలు.. భారీగా తగ్గిన ధరలు

కొత్త నిబంధనల ప్రకారం, వైన్ షాపులు , బార్లు రాత్రి 10 గంటలలోపు, పాన్ షాపులు రాత్రి 11 గంటలలోపు, రెస్టారెంట్లు, దాబాలు, టీ స్టాల్స్ రాత్రి 12 గంటలలోపు కార్యకలాపాలు ముగించాలి. నిబంధనలను ఉల్లంఘిస్తే, వారిపై హైదరాబాద్ పోలీసు చట్టం 21/76 అమలు చేయబడుతుందని ప్రభుత్వం వెల్లడించింది.

షాద్‌నగర్ టౌన్ సీఐ ప్రతాప లింగం మాట్లాడుతూ.. రూల్స్ ను ఉల్లంఘించినవారికి రూ. 25వేల జరిమానా విధించబడుతుందని, కోర్టుకు కూడా పంపిస్తామని హెచ్చరించారు. నియమాలను పదే పదే ఉల్లంఘిస్తే రూ. 50 వేల వరకు జరిమానాలు విధించే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేశారు. సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button