తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Raja Reddy: వైఎస్ షర్మిల ఇంట్లో త్వరలో పెళ్లిబాజాలు.. చకచకా ఏర్పాట్లు

ఏపీలో ప్రధానంగా వైసిపి, టీడీపీకి మధ్య రాజకీయాలు నడుస్తుంటాయి. ఇక ఈ రెండు పార్టీలు ఉప్పు, నిప్పులా ఉంటాయి. ఒకవిధంగా చెప్పాలంటే.. వైసిపికి రెడ్డి సామాజిక వర్గం, టిడిపి కమ్మ సామాజిక వర్గం మద్దతుగా నిలుస్తుంటాయి. అందుకే ఆంధ్రలో కులరాజకీయాలు ఎక్కువ. అలాంటి ఏపీలో ప్రస్తుతం అందుతున్న ఓ వార్త రాష్ట్రంలోని రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Also read: Mitchell Marsh: వరల్డ్ కప్ ట్రోఫీపై మిచెల్ కాళ్లు.. వ్యవహారంపై ఆసక్తికర వ్యాఖ్యలు

వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి.. అమెరికాలో చదువుకుంటున్నాడు. అయితే ఆయన త్వరలోనే అమెరికా వాసి.. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రియ అట్లూరి అనే యువతిని పెళ్లిచేసుకుంటారట. వీరిద్దరూ అమెరికాలో ఉంటూ.. నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇక పెళ్లితో ఒక్కటవ్వాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

కాగా.. వైఎస్ కుటుంబంలో కులాంతర వివాహాలు చేసుకోవటం కొత్తేమీకాదు. గతంలో వైఎస్ షర్మిల కూడా.. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన బ్రదర్ అనిల్ ను పెళ్లాడారు. అయితే వీరిద్దరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించి పెళ్లిపనులు ప్రారంభించినట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button