తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Robot Janitor: అబ్బురపరిచే రోబో పనితనం… ఆశ్చర్యం వ్యక్తంచేసిన ఆనంద్ మహీంద్రా

ప్రపంచంలోని ఆసక్తికర విషయాల్ని తమ ఫాలోవర్లతో పంచుకోవడంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ముందుంటారు. తాజాగా ఆయన షేర్ చేసిన ఓ రోబో వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మనుషుల సాయం లేకుండా తనంతట తానుగా బాత్రూమ్‌లు శుభ్రం చేసే ఈ రోబో పనితీరు చూసి ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యపోయారు.

Also Read: అయోధ్య రామయ్య ఆలయ ప్రారంభం.. ఆఫ్గాన్ నుంచి ప్రత్యేక కానుక

సోమాటిక్ అనే సంస్థ ఈ రోబోను సిద్ధం చేసినట్టు ఆనంద్ మహీంద్రా తెలిపారు. తనంతట తానుగా బాత్రూమ్‌లను శుభ్రం చేస్తోందని తెలిపారు. వాహనతయారీ దారులుగా తమకు ఫ్యాక్టరీల్లో రోబోలు వాడటం అలవాటే కానీ ఇలాంటి రోబోలు మరింత ముఖ్యమైనవని చెప్పారు. ఇలాంటివి తక్షణం అందుబాటులోకి రావాలని ఆయన ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button