తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Russia: రష్యా అధ్యక్షుడిగా మళ్లీ పుతిన్!

రష్యాలో విడతలవారీగా జరుగుతున్న అధ్యక్ష ఎన్నికలో ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ గెలుపు దిశగా పయనిస్తున్నారు. శుక్రవారం ప్రారంభమైన ఓటింగ్ ఇవాళ కూడా కొనసాగుతోంది. పేరుకు ఈ ఎన్నికల్లో పలు పార్టీలకు చెందిన అభ్యర్థులు బరిలో ఉన్నా.. ఐదోసారి క్రెమ్లిన్‌ పగ్గాలను ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ చేపట్టడం ఖాయమని అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికల్లో మొత్తం 11.2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ALSO READ: ‘నా బలం, నా బలగం వాళ్లే’.. ఎవరూ సాహసించని అరుదైన ఘట్టం!

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ సారి రష్యాలోనే కాకుండా.. ఉక్రెయిన్‌లోని ఆక్రమించిన భూభాగాల్లోనూ మాస్కో ఎన్నికలను నిర్వహిస్తోంది. కాగా.. పుతిన్‌ ప్రధాన ప్రత్యర్థి అలెక్సీ నావల్నీ ఇటీవల జైలులోనే మరణించిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఇతర ప్రత్యర్థులు సైతం ప్రవాసంలోనో, జైళ్లలోనో ఉన్నారు. రంగంలో మిగిలిన ముగ్గురు అభ్యర్థులు మిత్రపక్షాలకు చెందిన నామమాత్ర ప్రత్యర్థులే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button