తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

South Central Railway: సంక్రాంతి పండుగకు ఊరెళ్తున్నారా.. ప్రత్యేక రైళ్లు వచ్చేశాయ్!

సంక్రాంత్రి పండుగ వచ్చేస్తోంది. దీంతో హైదరాబాద్ లో ఉంటున్న వారంతా తమ సొంత ఊళ్లకు వెళ్లేందుకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. ఇక ప్రతిరోజు నడిచే రైళ్లలో బెర్తులన్నీ ఎప్పుడో నిండేశాయి. మరోవైపు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నా.. అవి ఏ మాత్రం సరిపోవడం లేదు. మరోవైపు ప్రైవేటు ఆశ్రయించాలంటే.. వారు ఇదే అదనుగా భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో సగటు వ్యక్తులు సొంత ఊరు వెళ్లడం పెద్ద పరీక్ష మారింది. ఈ నేపథ్యంలోనే దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు డిసెంబర్ 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు నడవనున్నాయి.

Also read: Kakatiya University: కేయూలో ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సదస్సు.. హాజరుకానున్న ప్రముఖులు

రైలు నెం. 07605 తిరుపతి- అకోలా మధ్య జనవరి 5 నుంచి 26 వరకు ప్రతి శుక్రవారం నడవనుంది. రైలు నెం. 07606 అకోలా- తిరుపతి మధ్య జనవరి 7 నుంచి 28 వరకు ప్రతి ఆదివారం రాకపోకలు సాగించనుంది. రైలు నెం. 07609 పూర్ణ- తిరుపతి మధ్య జనవరి 1 నుంచి 29 వరకు సోమవారం, రైలు నెం. 07610 తిరుపతి- పూర్ణ మధ్య జనవరి 2 నుంచి 30 వరకు ప్రతి మంగళవారం రాకపోకలు సాగించనున్నాయి. రైలు నెం. 07631 హైదరాబాద్- నర్సాపూర్ మధ్య జనవరి 6 నుంచి 27 వరకు ప్రతి శనివారం, రైలు నెం. 07632 నర్సాపూర్- హైదరాబాద్ మధ్య జనవరి 7 నుంచి 28 వరకు ప్రతి ఆదివారం నడవనున్నాయి. రైలు నెం. 07481 తిరుపతి- సికింద్రాబాద్ మధ్య జనవరి 7 నుంచి 28 వరకు ప్రతి ఆదివారం, రైలుూ నెం. 07482 సికింద్రాబాద్- తిరుపతి మధ్య జనవరి 8 నుంచి 29 వరకు ప్రతి సోమవారం రాకపోకలు సాగిస్తాయి. రైలు నెం. 07445 కాకినాడ టౌన్- లింగంపల్లి మధ్య జనవరి 1 నుంచి 31 వరకు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో, రైలు నెం. 07446 లింగంపల్లి- కాకినాడ టౌన్ మధ్య జనవరి 2 నుంచి ఫిబ్రవరి 1 వరకు ప్రతి మంగళ, గురు, శనివారాల్లో ఈ రైళ్లు నడుస్తాయి.

మరోవైపు సంక్రాంతికి మరిన్ని రైళ్లను సౌత్ సెంట్రల్ రైల్వే నడపబోతోంది. రైలు నెం. 07653 కాచిగూడ- కాకినాడ టౌన్ మధ్య డిసెంబర్ 28, జనవరి 4, 11, 18, 25న ప్రతి గురువారం రాత్రి 8.30 గంటలకు కాచిగూడలో బయల్దేరి మరుటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడ చేరనుంది. ఇక రైలు నెం. 07654 కాకినాడ టౌన్- కాచిగూడ మధ్య డిసెంబర్ 29, జనవరి 5, 12, 19, 26న ప్రతి శుక్రవారం రా. 7.30 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 4.50 గంటలకు కాచిగూడ చేరనుంది. ఈ రైళ్లు మల్కాజ్ గిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలారు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట మీదుగా రాకపోకలు సాగించనున్నాయి. ఈ రైలులో ఫస్ట్ ఏసీ, టూ టైర్, త్రీ టైర్, స్లీపర్, జనరల్ బోగీలు ఉన్నాయి.

ఇక రైలు నెం. 07509 హైదరాబాద్- తిరుపతి మధ్య డిసెంబర్ 28, జనవరి 4, 11, 18, 25 తేదీల్లో ప్రతి గురువారం రాత్రి 7.25 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.20 గంటలకు తిరుపతి చేరుతుంది. ఇక రైలు నెం. 07510 తిరుపతి- హైదరాబాద్ మధ్య డిసెంబర్ 29, జనవరి 5, 12, 19, 26 తేదీల్లో ప్రతి శుక్రవారం రాత్రి 8.15 గంటలకు తిరుపతిలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.40 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ రైళ్లు సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్ల మీదుగా వెళ్లనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లకు ఏసీ టూ టైర్, త్రీటైర్, స్లీపర్, జనరల్ బోగీలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button