తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Public Talk: 6 గ్యారంటీలు అదుర్స్.. మా ఓటు కాంగ్రెస్ కే అంటున్న ప్రజలు

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ తమను నిండా మోసం చేసిందనే అభిప్రాయం అన్ని వర్గాల ప్రజల్లో (Public) ఏర్పడింది. దాదాపు పదేళ్లుగా కేసీఆర్ (KCR) పాలనతో విసుగెత్తిన ప్రజలకు కాంగ్రెస్ పార్టీ (Congress Party) ప్రకటించిన ‘6 గ్యారంటీలు’ ఆశాదీపంలా కనిపించింది. కేసీఆర్ లాగా వందల హామీలు ఇవ్వలేదు. కేవలం ఆరు హామీలు ఇచ్చి పక్కా అమలు చేస్తామని చెప్పింది. ప్రకటించిన 6 హామీలు (Promises) కూడా ఆషామాషీవి కావు. అవి ప్రజల స్థితిగతులు మార్చే హామీలు. ఆ హామీలపై ప్రజల నుంచి ఊహించని స్పందన లభిస్తోంది.

Also Read తెలంగాణలో 2 రోజులు బడులు బంద్

కర్ణాటకలో (Karnataka) ప్రకటించిన గ్యారంటీలు (6 Guarantees) పక్కా అమలవుతున్నాయని.. అదే మాదిరి తెలంగాణలోనూ అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రకటిస్తున్నారు. ప్రకటించిన 6 గ్యారంటీలు ప్రజల్లో సానుకూల స్పందన లభిస్తోంది. గ్యారంటీలకు ఆకర్షితులై హస్తం గుర్తుకే ఓటు వేస్తామని ప్రజలు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి తీసుకువస్తామని స్పష్టం చేస్తున్నారు. ప్రచార కార్యక్రమాల్లో కూడా ప్రజలు ఇదే సమాధానం చెబుతుండడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఫుల్ జోష్ లో ఉన్నారు.

Also Read అర్ధరాత్రి కలకలం.. మధుయాష్కీ నివాసంలో పోలీసుల తనిఖీలు

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఇవే..

మహాలక్ష్మి:

  • ప్రతి మహిళకు రూ.2,500 చొప్పున ఆర్థిక సహాయం.
  • రూ.500కే గ్యాస్ సిలిండర్.
  • రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.

రైతు భరోసా:

  • రైతులు, కౌలు రైతులకు ఏడాదికి రూ.15,000 చొప్పున పెట్టుబడి సహాయం.
  • వ్యవసాయ కూలీలకు రూ.12,000 ఆర్థిక సహాయం
  • వరి పంటకు అదనంగా రూ.500 బోనస్ ప్రకటన

గృహజ్యోతి:

  • ఉచితంగా 200 యూనిట్ల గృహ వినియోగం

ఇందిరమ్మ ఇళ్లు:

  • ఇల్లు లేని పేదలందరికీ ఇంటి స్థలం పంపిణీ. దీంతోపాటు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం.
  • తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం.

యువ వికాసం:

  • విద్యా భరోసా కార్డు కింద విద్యార్థులకు రూ.5 లక్షల పరిమితితో వడ్డీ రహిత ఆర్థిక సహాయం. విద్యకు సంబంధించిన అన్ని ఫీజులు, ఖర్చులు చేసుకునేలా ఈ సహాయం అందజేత.
  • ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ పాఠశాలల ఏర్పాటు.

చేయూత:

  • పింఛన్ దారులకు నెలకు రూ.4,000 పింఛన్.
  • ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల బీమా సదుపాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button