తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

చరిత్రలో ఈరోజు: జూలై 5

పీవీ సింధు పుట్టినరోజు

తెలుగు క్రీడాకారిణి, భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు 1995లో జన్మించారు. 2016లో జరిగిన రియో ఒలింపిక్ క్రీడల్లో రజత పతకం సాధించి ఒలింపిక్ పోటీల్లో రజత పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించారు.

కళ్యాణ్ రామ్ పుట్టినరోజు

నందమూరి తారకరామారావు మనవడు, టాలీవుడ్ హీరో కళ్యాణ్ రామ్ 1980లో జన్మించారు. 2003లో ‘తొలిచూపులోనే’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన ఈయన పలు హిట్ చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణ సంస్థను స్థాపించి పలు చిత్రాల్ని నిర్మించారు.

లోక్‌సభలో జీర్ అవర్ చర్చలు ప్రత్యక్ష ప్రసారం ప్రారంభం

స్పీకర్ సోమనాధ్ చటర్జీ ఆదేశాలపై 2004 జూలై 5 నుంచి లోక్‌సభ‌లో జరిగే శూన్య గంట (జీరో అవర్) చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయటం మొదలుపెట్టారు.

ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు

1954 జూలై 5న ఆంధ్ర రాష్ట్ర హైకోర్టును నెలకొల్పారు. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నాయకులు 1937 నవంబర్ 15న శ్రీబాగ్ ఒడంబడికపై చేసిన సంతకాల మేరకు దీనిని ఏర్పాటుచేశారు.

పాకిస్తాన్‌లో కుప్పకూలిన జుల్పీకర్ ఆలీ భుట్టో ప్రభుత్వం

పాకిస్తాన్ మిలిటరీ అధికారులు కుట్ర చేసి 1977లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన జుల్పీకర్ ఆలీ భుట్టోను ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించారు.

మొట్టమొదటిసారి క్లోనింగ్ ద్వారా గొర్రె జననం

1996 జూలై 5న శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారి క్లోనింగ్ ద్వారా ఒక పెద్ద గొర్రె నుంచి సేకరించిన జీవకణం ద్వారా డాలీ అనే పేరు గల గొర్రెను పుట్టించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button