తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

చరిత్రలో ఈరోజు: జూన్ 15

చక్రి జననం

ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు చక్రి 1974లో మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లిలో జన్మించారు. ఇడియట్, సత్యం, శివమణి, దేశముదురు వంటి సినిమాలకు సంగీతం అందించి గుర్తింపు పొందారు. ‘సింహా’ సినిమాకు గానూ ఉత్తమ సంగీత దర్శకుడిగా నంది అవార్డును అందుకున్నారు.

అన్నాహజారే పుట్టినరోజు

ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే 1937లో జన్మించారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లాలో రాలెగావ్ సిద్ధి గ్రామ అభివృద్ధికి చేసిన తోడ్పాటుకు గానూ 1990లో కేంద్ర ప్రభుత్వం ఈయనకు పద్మశ్రీ అవార్డుతో, 1992లో పద్మ భూషణ్ అవార్డుతోనూ సత్కరించింది.

మనికా బాత్రా పుట్టినరోజు

భారతీయ ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనికా బాత్రా 1995లో జన్మించారు. టేబుల్ టెన్నిస్ క్రీడలో విశేష ప్రతిభ కనబరిచిన ఈమెకు కేంద్ర ప్రభుత్వం 2018లో అర్జున అవార్డును, 2020లో మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డును ఇచ్చింది.

శ్రీశ్రీ వర్ధంతి

తెలుగు జాతి గర్వించే ప్రముఖ కవి, శ్రీశ్రీ అని అందరూ పిలిచే శ్రీరంగం శ్రీనివాసరావు 1983లో మరణించారు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా ఎంతో గుర్తింపు పొందారు. ఈయన రాసిన ‘మహాప్రస్థానం’ తెలుగు సాహిత్య రంగంలో విశేష ప్రసిద్ధి పొందింది.

One Comment

  1. My admiration for your creations is as substantial as your own sentiment. The visual presentation is tasteful, and the written content is sophisticated. Yet, you seem uneasy about the possibility of presenting something that may cause unease. I’m confident you’ll be able to resolve this issue efficiently.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button