తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

చరిత్రలో ఈరోజు: జూన్ 4

అల్లూరి సీతారామరాజు జయంతి

భారత స్వాతంత్య్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు (1897 జూలై 4 – 1924 మే 7) ఒక మహోజ్వల శక్తి. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్ర్యం వస్తుందని నమ్మి, దాని కోసమే ప్రాణాలర్పించిన యోధుడు. బ్రిటీషు సామ్రాజ్యాన్నే ఢీకొట్టిన మహా శక్తి అల్లూరి.

గుర్జారీలాల్ నందా జయంతి

భారత జాతీయ రాజకీయ నాయకుడు గుర్జారీలాల్ నందా (జూలై 4, 1898 – జనవరి 15, 1998). 1964లో నెహ్రూ మరణం తరువాత, 1966లో లాల్ బహుదూర్ శాస్త్రి మరణం తర్వాత రెండు సార్లు భారతదేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించారు.

స్వామి వివేకానంద వర్థంతి

స్వామి వివేకానంద (జనవరి 12, 1863 – జూలై 4, 1902) ప్రసిద్ధి పొందిన హిందూ యోగి. రామకృష్ణ మఠాన్ని స్థాపించారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 1984లో భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని “జాతీయ యువజన దినోత్సవం”గా ప్రకటించింది.

మేరీ క్యూరీ వర్థంతి

మేరీ క్యూరీ (నవంబర్ 7, 1867 – జూలై 4, 1934) భౌతిక, రసాయనిక శాస్త్రవేత్త. రెండు నోబెల్ బహుమతులు (భౌతిక, రసాయన శాస్త్రాలలో) ప్రప్రథమంగా ఈమెకే లభించాయి. ఇప్పటికీ మరే శాస్త్రవేత్తకూ రెండు వేరువేరు రంగాలలో నోబెల్ బహుమతులు లభించలేదు.

పింగళి వెంకయ్య మరణం

భారత త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య(1876 ఆగస్టు 2, 1963 జూలై 4) వర్ధంతి నేడు. యావత్ భారతదేశం తలెత్తుకొని ఎలుగెత్తి సలాం కొట్టే జాతీయ జెండాను రూపొందించింది మన తెలుగువాడవ్వడం మన గర్వకారణం.

ఎం.ఎం. కీరవాణి పుట్టినరోజు

సంగీత సామ్రాజ్యాన్ని ఏలుతున్న ఎం.ఎం.కీరవాణి పుట్టిన రోజు నేడు. కీరవాణి 1961లో జూలై 4వ తేదీన జన్మించారు. ఆయన సంగీతం సమకూర్చిన RRR సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఉత్తమ ఒరిజినల్ పాటగా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button