తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

చరిత్రలో ఈరోజు: మే 30

గోవాకు సంపూర్ణ రాష్ట్ర ప్రతిపత్తి

56వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర పాలిత ప్రాంతమైన గోవాకు 1987లో ఇదే రోజున సంపూర్ణ రాష్ట్ర ప్రతిపత్తి కల్పించారు. 1961లో పోర్చుగీసు వారు గోవాను భారతదేశానికి అప్పగించిన విషయం తెలిసిందే.

ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా విశ్వనాథన్ ఆనంద్

2012 మే 30న భారత గ్రాండ్‌ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్.. ఇజ్రాయెల్‌కు చెందిన బోరిస్ గెల్‌ఫాండ్‌ను ఓడించి ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుపొందారు.

పరేష్ రావెల్ పుట్టినరోజు

ప్రముఖ బాలీవుడ్ నటుడు పరేష్ రావెల్ 1955లో జన్మించారు. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.

వంగిపురం హరికిషన్ పుట్టినరోజు

ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ప్రముఖ మిమిక్రీ కళాకారుడు వంగిపురం హరికిషన్ 1963లో జన్మించారు. ఒకే గంటలో 100 మంది గొంతులను అనుకరించి ‘శత కంఠ ధ్వన్యనుకరణ ధురీణ’ అనే బిరుదును పొందారు.

దాసరి నారాయణరావు వర్ధంతి

తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత ,రాజకీయ నాయకుడు దాసరి నారాయణ రావు 2017లో మరణించారు. 150 చిత్రాలకు దర్శకత్వం వహించి అత్యధిక చిత్రాల దర్శకుడిగా గిన్నిస్‌ పుటలకెక్కారు. దర్శకుడిగా, నటుడిగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు.

గుంటూరు శేషేంద్రశర్మ వర్ధంతి

తెలుగు కవి, విమర్శకుడు, సాహితీవేత్త, వక్త గుంటూరు శేషేంద్రశర్మ 2007లో తుదిశ్వాస విడిచారు. ఈయన రాసిన ‘నా దేశం-నా ప్రజలు’ 2004 నోబెల్ సాహిత్య పురస్కారానికి నామినేట్ అయ్యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button