తెలుగు
te తెలుగు en English
క్రికెట్

CWC 2023: భారత్ – నెదర్లాండ్స్ మ్యాచ్ ఆప్డేడ్స్

జడేజా వేసిన 46వ ఓవర్ లో తేజ నిడమానూరు నాలుగవ బాల్ ని సిక్స్ గా మలిచాడు. బుమ్రా వేసిన 47వ ఓవర్ మొదటి బంతికి ఆర్యన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. గ్రీజ్ లోకి వాన్ మీకెరెన్ వచ్చాడు. ఐదవ బంతికి తేజ బాల్ ని బౌండరీకి తరలించాడు. 48 వ ఓవర్ రోహిత్ శర్మ వేయగా నాలుగవ బంతిని సిక్స్ బాదాడు. తేజ నిడమానూరు 54 పరుగుల వద్ద షమీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. నెదర్లాండ్స్ 47.5 బాల్స్ ఆడి 250 పరుగులకు అలౌట్ అయింది. ఇండియా 160 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో భారత్ కు వరుసగా 9 విజయాలు లభించాయి.

వాన్ బిక్ క్లీన్ బౌల్డ్… డర్ మెర్వ్ క్యాచ్ అవుట్

కుల్ధీప్ వేసిన 41వ ఓవర్ లో తేజ నిడమానూరు సిక్స్ కొట్టాడు. నెదర్లాండ్స్ 200 పరుగులు సాధించింది.షమీ వేసిన 42 వ ఓవర్ లో వాన్ బీక్ ఫోర్ కొట్టాడు. కుల్ధీప్ వేసిన 43 వ ఓవర్ లో వాన్ బిక్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. గ్రీజ్ లోకి వాన్ డర్ మెర్వ్ వచ్చాడు. మెర్వ్ ఐదవ బంతిని సిక్స్ గా మలిచాడు. జడేజా బౌలింగ్ లో మెర్వ్ మరో సిక్స్ బాదాడు. మూడవ బంతిని ఫోర్ గా బౌండరీకి పంపించాడు. నాలుగవ బాల్ కి మెర్వ్ షమీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కి చేరాడు. ఆర్యన్ గ్రీజ్ లోకి వచ్చాడు.

వికెట్ తీసిన సిరాజ్… నెమ్మదిగా సాగుతున్న నెదర్లాండ్స్ బ్యాటింగ్

సిరాజ్ వేసిన 36వ ఓవర్ లో నాలుగవ బాల్ కి లెగ్ బై గా ఫోర్ వచ్చింది. సిరాజ్ వేసిన 38 వ ఓవర్ మూడవ బంతికి ఇంజెల్ బైక్ట్ 45 పరుగుల వద్ద క్లిన్ బౌల్డ్ చేశాడు. తర్వాత గ్రీజ్ లోకి లాగన్ వాన్ బీక్ వచ్చాడు. 39వ ఓవర్ లో కుల్దీప్ యాదవ్ వేసిన 3వ బాల్ కి సిక్స్ కొట్టాడు తేజ నిడమానూరు. నెదర్లాండ్స్ గెలవాలనే ఉద్దేశంతో కాకుండా 50 ఓవర్లు ఆడాలనే ఉద్దేశంతో ఆడుతున్నట్లు కనిపిస్తుంది. ఎలాగైనా గెలిచే అవకాశాలు లేకపోవడంతో పూర్తి ఓవర్లు ఆడి పరువు నిలుపుకునే స్కోరు చేయాలని నెదర్లాండ్స్ భావిస్తున్నట్లు కనిపిస్తుంది. షమీ వేసిన 40 వ ఓవర్ లో మూడవ బంతికి వాన్ బీక్ ఫోర్ కొట్టాడు. ఈ ఓవర్ లో 7 పరుగులు వచ్చాయి.

బుమ్రాకి వికెట్… క్యాచ్ లను మిస్ చేస్తున్న పిల్డర్లు

జడేజా వేసిన 26 వ ఓవర్ మొదటి బంతికి ఇంజెల్ బైక్ట్ ఫోర్ కొట్టాడు. ఐదవ బాల్ ని ఇంజెల్ బైక్ట్ మళ్ళీ ఫోర్ బాదాడు. జడేజా వేసిన 28 వ ఓవర్ లో కేవలం 4 పరుగులు మాత్రమే వచ్చాయి. నెదర్లాండ్స్ బ్యాటర్స్ పరుగులు చేయడానికి శ్రమిస్తున్నారు. గిల్ కి బౌలింగ్ అప్పగించాడు రోహిత్ శర్మ. నాలుగవ బంతిని డి లిడ్ ఫోర్ గా మలిచాడు. గిల్ 7 పరుగులు ఇచ్చి ఓవర్ ని ముగించాడు. బుమ్రా వేసిన 30వ ఓవర్ లో ఒక్క రన్ మాత్రమే ఇచ్చాడు. 31 వ ఓవర్ వేసిన గిల్ 4 పరుగులు ఇచ్చాడు. బుమ్రా వేసిన 32 ఓవర్ లో ఇంజెల్ బెక్ట్ క్యాచ్ ను సిరాజ్ మిస్ చేశాడు. చివరి బంతికి డి లిడ్ 12 పరుగుల వద్ద క్లీన్ బౌల్ట్ చేశాడు. గ్రీజ్ లోకి నిడమానూరు వచ్చాడు. 33 వ ఓవర్ ని సూర్యకుమార్ యాదవ్ కి అప్పగించాడు రోహిత్. ఈ ఓవర్ లో 4 పరుగులు వచ్చాయి. సూర్యకుమార్ వేసిన మొదటి, రెండవ బాల్స్ ని సిక్స్ లుగా నిడమానూరు మలిచాడు. ఈ ఓవర్ లో మొత్తం 13 పరుగలు వచ్చాయి. నెదర్లాండ్స్ స్కోర్ 162/5

విరాట్ కోహ్లీకి వికెట్ … ఎడ్వర్డ్స్ అవుట్

కుల్ధీప్ వేసిన 17 వ ఓవర్ లో చివరి బంతికి ఇంజెల్ బైక్ట్ ఫోర్ కొట్టాడు. డౌడ్ అవుట్ అయ్యాక గ్రీజ్ లోకి ఎడ్వర్డ్స్ వచ్చాడు. కుల్ధీప్ వేసిన 19 వ ఓవర్ లో 2 పరుగులు మాత్రమే వచ్చాయి. జడేజా వేసిన 20 వ ఓవర్ లో 3 పరుగులు వచ్చాయి. 21 ఓవర్ లో జడేజా డైరెక్ట్ త్రో వేశాడు వికెట్లకు దాంతో రన్ అవుట్ కు అప్లై చేశాడు. కానీ థర్డ్ అంఫైర్ నాటౌట్ గా ఇచ్చాడు. కోహ్లీ వేసిన 23 వ ఓవర్ లో ఇంజెల్ బైక్ట్ ఫ్లోర్ వచ్చింది. జడేజా వేసిన 24 వ ఓవర్ లో లెగ్ బై గా ఫోర్ వచ్చింది. దీంతో నెదర్లాండ్స్ 100 పరుగులు పూర్తి చేసుకున్నారు. మూడవ బాల్స్ ఎండ్వర్డ్స్ ఫోర్ గా మలిచాడు. జడేజా వేసిన ఈ ఓవర్ లో 12 పరుగులు వచ్చాయి. కోహ్లీ వేసిన 25 వ ఓవర్ లో మూడవ బంతికి ఎడ్వర్డ్స్ వికెట్ పడగొట్టాడు. గ్రీజ్ లోకి డి లీడ్ వచ్చాడు.

ఆకర్ మన్ ఎల్బీడబ్ల్యూ… డౌడ్ క్లీన్ బౌల్డ్

కుల్ధీప్ యాదవ్ వేసిన 11 వ ఓవర్ లో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. మొదటి వికెట్ పడిన తర్వాత ఆకర్ మన్, ఓ డౌడ్ ఆచితుచి ఆడుతున్నారు. వీలు చిక్కినప్పుడల్లా ఫోర్లు, సిక్స్ లు బాదుతూ వికెట్ కాపాడుకుంటున్నారు. కుల్ధీప్ యాదవ్ వేసిన 13వ ఓవర్ లో ఆకర్ మన్ 35(32) పరుగుల వద్ద ఎల్బీడబ్ల్యూ గా వెనుదిరిగాడు. గ్రీజ్ లోకి ఇంజెల్ బైక్ట్ వచ్చాడు. 15వ ఓవర్ కుల్ధీప్ యాదవ్ వేసిన నాలుగవ బాల్ కి డౌడ్ ఇచ్చిన క్యాచ్ ని సిరాజ్ వదిలివేశాడు. జడేజా వేసిన 16 వ ఓవర్ ఫస్ట్ బాల్ కే డౌడ్(30) క్లీన్ బౌల్డ్ గా వెనుదిరిగాడు. నెదర్లాండ్స్ స్కోర్ 75/3

నిలకడగా ఆడుతున్న ఆకర్ మన్, డౌడ్

సిరాజ్ వేసిన 6 వ ఓవర్ మొదటి బంతికే ఆకర్ మన్ ఫోర్ బాదాడు. మూడవ, నాలుగవ బాల్ ని ఫోర్ గా మలిచాడు. సిరాజ్ ఈ ఓవర్ లో 12 పరుగులు ఇచ్చాడు. బుమ్రా వేసిన 7వ ఓవర్ ఐదవ బాల్ కి ఆకర్ మన్ ఫోర్ కొట్టాడు.షమీ వేసిన 8 వ ఓవర్ రెండవ బాల్ కి ఆకర్ మన్ ఫోర్ బాదాడు. ప్రతి ఓవర్ లో ఫోర్ కొడుతు నెదర్లాండ్స్ మంచి స్కోర్ నమోదు చేస్తుంది. సిరాజ్ వేసిన మొదటి బాల్ నే ఫోర్ గా మలిచాడు ఆకర్ మన్. షమి బౌలింగ్ లో డౌడ్ బాల్ ని బౌండరీకి తరలించాడు. ఆకర్ మన్, డౌట్ పార్డ్ నర్ షిప్ 48 బంతుల్లో 51 పరుగులు చేశారు. షమీ వేసిన ఐదవ బాల్ కి డౌడ్ సిక్స్ కొట్టాడు. ఈ ఓవర్ లో షమీ 10 పరుగులు ఇచ్చాడు.

బరెసీ అవుట్…. వికెట్ తీసిన సిరాజ్

బుమ్రా వేసిన మొదటి ఓవర్ లో 5 పరుగులు వచ్చాయి. గ్రీజ్ లో బరెసీ, ఓ డౌడ్ ఉన్నారు. సిరాజ్ వేసిన ఫస్ట్ ఓవర్ లోనే వికెట్ తీసుకున్నాడు. మూడవ బంతికి బరెసీ (4) పరుగుల వద్ద రాహుల్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. గ్రీజ్ లోకి ఆకర్ మన్ వచ్చాడు. సిరాజ్ తన ఓవర్ ను మెయిడిన్ చేసి వికెట్ తీశాడు. బుమ్రా వేసిన మూడవ ఓవర్ కూడా మెయిడిన్ అయింది. నెదర్లాండ్స్ బ్యాటర్లు పరుగుల చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. సిరాజ్ వేసిన 4వ ఓవర్ లో మూడవ బంతిని డౌడ్ బౌండరీకి తరలించాడు. ఐదు ఓవర్లు పూర్తి అయ్యేసారికి నెదర్లాండ్స్ స్కోర్ 17/1

భారత ఇన్నింగ్

వన్డే ప్రపంచకప్ లో భాగంగా బెంగుళూరు లోని చిన్న స్వామి స్టేడియంలో భారత్, నెదర్లాండ్స్ తలపడుతున్నాయి. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ భారీ స్కోర్ చేసింది. 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 410 పరుగులు చేసింది.

ముందుగా బ్యాటింగ్ దిగిన భారత్ ఓపెనర్లు మంచి ఆరంభన్ని ఇచ్చారు. రోహిత్ శర్మ 61 (54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్ లు), మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్ 51 ( 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్ లు) పరుగులతో నెదర్లాండ్స్ బౌలర్లను ఊచకోత కోశారు. వేగంగా ఆడుతున్న గిల్ ని వాన్ మీకెరెన్ అవుట్ చేసిన కొద్దిసేపటికే భారీ సిక్స్ కు ట్రై చేసి రోహిత్ డి లిడి బౌలింగ్ లో క్యాచ్ అవుట్ గా పెవిలియన్ చేరాడు. అనంతరం కోహ్లీ, శ్రేయస్ నెమ్మదిగా ఆడుతు పరుగులు సాధించారు. విరాట్ కోహ్లీ 51( 56 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) కొట్టి డెర్ మెర్వ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ గా వెనుదిరిగాడు. అనంతరం గ్రీజ్ లోని వచ్చిన కేఎల్ రాహుల్ తో శ్రేయస్ ఇన్నింగ్స్ ను పరుగులు పెట్టించాడు. ఫోర్లు, సిక్స్ లను అవలీలగా బాదుతు నెదర్లాండ్స్ బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టారు. ఓ దశలో వీరిద్దరికి ఏ బాల్ వేయాలో కూడా బౌలర్లకు అర్థం కాలేదు కావచ్చు అనిపించింది. ఇన్నింగ్స్ లో చివరి బాల్ మిగిలి ఉండగ కేఎల్ రాహుల్ 102(64 బంతుల్లో 11 ఫోర్లు, 4సిక్స్ లు) భారీ సిక్స్ కు ప్రయత్నించి డి లీడి బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. శ్రేయస్ అయ్యార్ 128( 94 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్ లు)లతో నాటౌట్ కాగ సూర్య కుమార్ యాదవ్ 2 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.

నెదర్లాండ్స్ బౌలింగ్ లో డి లిడ్ 4, వాన్ మెకెరన్ 1, వాన్ డెర్ మెర్వ్ 1 వికెట్ తీసుకున్నారు.

సెంచరీలతో రెచ్చిపోయిన శ్రేయస్, కేఎల్…. భారీ స్కోర్ చేసిన టీమిండియా

46వ ఓవర్ రెండవ బంతిని కేఎల్ ఫోర్ కొట్టాడు. శ్రేయస్ ప్రపంచకప్ లో మొదటి సెంచరీ సాధించాడు. 84 బంతుల్లో సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 47వ ఓవర్ లో రాహుల్ నాలుగవ బంతికి ఫోర్ కొట్టాడు. ఐదవ బంతికి సిక్స్ కొట్టాడు. ఈ ఓవర్ లో 14 పరుగులు వచ్చాయి. ఇద్దరి పార్ట్ నర్ షిప్ 160 పరుగులకు చేరుకుంది. 48 ఓవర్ మూడవ బంతికి కేఎల్ ఫోర్ బాదాడు. వాన్ బీక్ వేసిన 49వ ఓవర్ లో శ్రేయస్ వరుసగా మొదటి, రెండవ బాల్స్ ని సిక్స్ లుగా మలిచాడు. ఐదవ బంతిని శ్రేయస్ సిక్స్ కొట్టాడు. చివరి బంతిని ఫోర్ బాదాడు. ఓవర్ లో బ్యాటర్లు మంచి స్కోర్ రాబట్టారు. ఇందులో 25 పరుగులు వచ్చాయి. శ్రేయస్ మూడు సిక్స్ లు, ఒక్క ఫోర్ కొట్టాడు. లాస్ట్ ఓవర్ మొదటి బంతికే కేఎల్ సిక్స్ కొట్టడంతో 95 పరుగులకు చేరుకున్నాడు. మళ్లీ సిక్స్ కొట్టిన కేఎల్ దీంతో 101 (62) సెంచరీ పూర్తిచేసుకున్నాడు. కేఎల్ రాహుల్ భారీ సిక్స్ కొట్టే ప్రయత్నంలో 102 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. శ్రేయస్ అయ్యార్ 128(94) పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. చివరలో సూర్యకుమార్ యాదవ్ 2(1) పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 50 ఓవర్లు పూర్తయ్యేసారికి ఇండియా స్కోర్ 410/4

సిక్స్ లతో విరుచుకుపడుతున్న కేఎల్, శ్రేయస్

లాస్ట్ 10 ఓవర్లే మిగిలి ఉండడంతో శ్రేయస్, కేఎల్ గేర్ మార్చే అవకాశం. 41 వ ఓవర్ రెండ, మూడవ బంతిలకు వరుసగా ఫోర్లు కొట్టాడు కేఎల్ రాహుల్. ఈ ఓవర్ లో మొత్తం 12 పరుగులు వచ్చాయి. డి లీడ్ వేసిన 42 వ ఓవర్ నాలుగవ బంతికి శ్రేయస్ ఫోర్ కొట్టాడు. వీరిద్దరి పార్ట్ నర్ షిప్ 100 పరుగులు అయ్యాయి. వాన్ లీడ్ వేసిన 43 వ ఓవర్ లో కేఎల్ రాహుల్ 50(40) పరుగులు చేశాడు. దీంతో వచ్చిన ఐదుగురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలు చేశారు. ఐదవ బాల్ ని శ్రేయస్ బౌండరీకి తరలించాడు. వాన్ మీకెరన్ వేసిన 44 వ ఓవర్ మూడవ బంతికి శ్రేయస్ సిక్స్ కొట్టాడు.కేఎల్ రాహుల్ ఐదవ బంతిని సిక్స్ గా మలిచాడు. కేఎల్ కి మొదటి సిక్స్. వాన్ మీకెరన్ బౌలింగ్ లో భారత్ బ్యాటర్ లు రెచ్చిపోయారు. ఈ ఓవర్ లో 17 పరుగులు వచ్చాయి. వాన్ బీక్ 45వ ఓవర్ లో నాలుగవ బంతికి కేఎల్ ఫోర్ బాదాడు. ఈ ఓవర్ మంచి ఓవరనే చెప్పుకోవాలి. ఈ ఓవర్ లో 7 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో 45 ఓవర్లు పూర్తి అయ్యే సారికి భారత్ స్కోర్ 337/3

భారీ స్కోర్ దిశగా టీమిండియా… నిలకడగా ఆడుతున్న శ్రేయస్, కేఎల్ రాహుల్

ఇప్పటి వరకు వచ్చిన ఇండియా బ్యాటర్లు అందరు 50 పరుగులు పూర్తి చేసుకున్నారు. ODI లో టాప్ నాలుగురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలు చేయడం ఇదే మొదటి సారి. కేఎల్, శ్రేయస్ పార్ట్ నర్ షిప్ 50 పరుగులు పూర్తి చేసుకున్నారు. డీ లిడ్ వేసిన ఓవర్ లో ఫోర్ కొట్టారు. 37వ ఓవర్ వాన్ డర్ మెర్వ్ వేసిన ఐదవ బంతిని కేఎల్ బౌండరీకి తరలించాడు. వాన్ మెకెరెన్ వేసిన 38 వ ఓవర్ మూడవ బాల్ ని కేఎల్ ఫోర్ కొట్టాడు. ఈ ఓవర్ లో 9 పరుగులు వచ్చాయి. వాన్ డర్ మెర్వ్ వేసిన మొదటి బంతినే కేఎల్ బౌండరీకి తరలించాడు. 39 వ ఓవర్ రెండవ బంతికి శ్రేయస్ సిక్స్ కొట్టాడు. 40 ఓవర్ లో 10 పరుగులు వచ్చాయి. ఓవర్ పూర్తి అయ్యేసారికి టీమిండియా స్కోర్ 284/3

హాఫ్ సెంచరీ చేసిన శ్రేయస్

31వ ఓవర్ మూడవ బంతిని శ్రేయస్ బౌండరీకి తరలించాడు. ఈ ఓవర్ లో 6 రన్స్ వచ్చాయి. నెదర్లాండ్స్ బౌలర్లు కట్టుదిట్టమైన బాల్స్ వేస్తున్నారు. మొదటి పది ఓవర్లతో పోల్చుకుంటే స్కోర్ ను బౌలర్లు కట్టిడి చేశారు. 32 వ ఓవర్ లో కేవలం 2 పరుగులు మాత్రమే వచ్చాయి.అకర్ మన్ వేసిన 33వ ఓవర్ లో 5 ఐదు రన్స్ మాత్రమే వచ్చాయి. డి లీడ్ వేసిన 34వ ఓవర్ లో రెండవ బాల్ ని శ్రేయస్ బౌండరీ తరలించాడు. శ్రేయస్, కేఎ రాహుల్ నెమ్మదిగా ఆడుతు సింగిల్స్ తీస్తు వీలైనప్పుడు బౌండరీలు తరలిస్తున్నారు. శ్రేయస్ 53(48) ఐదవ బాల్ కి ఫోర్ తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అకర్ మన్ వేసిన రెండవ బంతికి కేఎల్ రాహుల్ ఫోర్ బాదాగా ఇది అతనికి రెండవ బౌండరీ. 35 ఓవర్లు పూర్తి అయ్యేసారికి ఇండియా స్కోర్ 244/3

కోహ్లీ అవుట్… గ్రీజ్ లోకి కేఎల్ రాహుల్

కోహ్లీ, శ్రేయస్ కలిసి 48 బంతుల్లో 50 పరుగుల పార్ట్ నర్ షిప్ ను పూర్తి చేసుకున్నారు. ఇందులో శ్రేయస్ 16, కోహ్లీ 33 పరుగులు చేశారు. 26 వ ఓవర్ ఐదవ బంతిని శ్రేయస్ బౌండరీకి తరలించారు. ఈ ఓవర్ లో 6 పరుగులు వచ్చాయి. 27వ ఓవర్ లో కూడా ఆరు రన్స్ వచ్చాయి. 28 వ ఓవర్ వాన్ మీకెరెన్ వేసిన మొదటి బంతికి శ్రేయస్ ఫోర్ బాదాడు. వాన్ మీకెరెన్ వేసిన 28 వ ఓవర్ లాస్ట్ బాల్ కి సింగిల్ తో 53 బంతుల్లో కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఇండియా 200 పరుగులు పూర్తి చేసుకుంది. వాన్ డర్ మెర్వ్ వేసిన 4వ బాల్ కి కోహ్లీ 51(56) రన్స్ కు అవుట్ అయ్యాడు. గ్రీజ్ లోకి కేఎల్ రాహుల్ వచ్చాడు. 29వ ఓవర్ ఐదవ బంతికి కేఎల్ ఫోర్ బాదడంతో మొదటి ఫోర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో 30 ఓవర్లు పూర్తి అయ్యేసారికి ఇండియా స్కోర్ 211/3

నిదానంగా ఆడుతున్న కోహ్లీ, శ్రేయస్

కోహ్లీ వచ్చిన చాలా సేపు తర్వాత ఫోర్ కొట్టాడు. శ్రేయస్, కోహ్లీ అచితూచి ఆడుతు ఎక్కువగా సింగిల్స్ పైనే ఫోకస్ చేస్తున్నారు. వాన్ బీక్ వేసిన మూడవ బంతికి కింగ్ కోహ్లీ సిక్స్, తర్వాత బాల్ కి ఫోర్ కోట్టాడు. ఈ ఓవర్ లో మొత్తం 11 పరుగులు వచ్చాయి. కోహ్లీ గేర్ మారుస్తున్నట్లు కనిపిస్తుంది. 23వ ఓవర్ ఫస్ట్ బాల్ నే కోహ్లీ బౌండరీకి తరలించాడు. 24 వ ఓవర్ 4వ బాల్ ని కోహ్లీ ఫోర్ గా బౌండరీకి తరలించాడు. 25 ఓవర్లు పూర్తి అయ్యే సారికి భారత్ స్కోర్ 178/2

రోహిత్ అవుట్… నెమ్మదించిన స్కోర్

విరాట్ కోహ్లీ నెమ్మదిగా ఆడుతూ ఎక్కువగా సింగిల్స్ పై దృష్టి పెడుతున్నాడు. వాన్ మెర్వె వేసిన 16 వ ఓవర్ లో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. కోహ్లీ ఎదుర్కొన్న 19 వ బాల్ ని బౌండరీకి తరలించాడు. డి లీడ్ వేసిన నాలుగవ బంతికి రోహిత్ శర్మను పెవిలియన్ కి పంపించాడు. రోహిత్ 61 రన్స్ వద్ద అవుట్ అయ్యాడు. గ్రీజ్ లోకి శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. డి లీడ్ వేసిన 4వ బంతికి శ్రేయస్ ఫోర్ బాదాడు. 20 ఓవర్లు పూర్తి అయ్యేసారికిి ఇండియా స్కోర్ 140/2

సిక్స్ బాదే ప్రయత్నంలో గిల్ అవుట్

11వ ఓవర్ లో నాలుగు పరుగులు మాత్రమే వచ్చాయి. గిల్ 30 బంతులలో 50 పరుగులు పూర్తిచేసుకున్నాడు. గిల్, రోహిత్ 100 రన్స్ భాగస్వామ్యం వచ్చింది. 12 ఓవర్ లో 5 వ బంతికి వాన్ మికెరెన్ బౌలింగ్ లో గిల్ అవుట్ అవ్వడంతో గ్రీజ్ లోకి కోహ్లీ వచ్చాడు. వాన్ మికెరన్ 14 వ ఓవర్ లో కట్టుదిట్టమైన బౌలింగ్ వేశాడు. పరుగుల వరద కొంచెం తగ్గింది. లాస్ట్ బాల్ కి ఫోర్ కొట్టడంతో రోహిత్ 52(44) పరుగులు పూర్తిచేసుకున్నాడు. 15 వ ఓవర్ రెండవ బంతికి రోహిత్ సిక్స్ బాదాడు. ఓవర్ పూర్తి అయ్యే సారికి స్కోర్ 119/1

ఫోర్లు, సిక్స్ లతో విరుచుకుపడుతున్న ఇండియా బ్యాటర్లు

6 వ ఓవర్లలో మొదటి బంతిని ఫోర్ గిల్ బాదాడు. ఈ ఓవర్ లో గిల్ రెచ్చిపోతున్నాడు. మూడవ బంతికి ఫోర్ నాలుగవ బంతికి సిక్స్ కొట్టాడు. లాస్ బాల్ కి మళ్లీ పోర్ బాదాడు గిల్. ఈ ఓవర్ లో మొత్తం 18 పరుగులు వచ్చాయి. రోహిత్ శర్మ తర్వాతి ఓవర్ల లో ఒక ఫోర్, సిక్స్ కొట్టాడు. 8వ ఓవర్ లో నాలుగవ బంతికి గిల్ స్టేప్ అవుట్ అయి బంతిని బలంగా కొట్టిన బాల్ హైట్ వెళ్లడం వల్ల ఎవరు ఫిల్డర్స్ లేని దగ్గర పడింది. లాస్ బంతికి గిల్ సిక్స్ కొట్టాడు. 9 వ ఓవర్ లో రెండవ బాల్ కి బంతిని బౌండరీకి తరలించాడు రోహిత్. 10వ ఓవర్ లో మొదటి బంతికే సిక్స్ కొట్టడంతో ఈ మ్యాచ్ లో మొత్తంగా నాలుగవ సిక్స్ గిల్ కి. నాలుగవ బంతికి ఫోర్ గా బౌండరి దగ్గరకి పంపించాడు. పది ఓవర్లు ముగిసేసారికి ఇండియా 91/0 గా నిలిచింది

మంచి భాగస్వామ్యం నెలకొల్పిన గిల్, రోహిత్

మొదటి ఓవర్లులోనే రోహిత్ శర్మ 10 పరుగులు సంధించాడు. మూడవ ఓవర్ ఆర్యన్ వేసిన మొదటి బంతికే ఫోర్ కొట్టాడు. లాస్ట్ బాల్ కి అద్బుతమైన సిక్స్ బాదాడు గిల్. వాన్ బీక్ వేసిన నాలుగవ ఓవర్లులో రెండవ బంతికి డిఆర్ఎస్ అవుట్ అనుకున్నారు కానీ నెదర్లాండ్స్ ప్లేయర్స్ కోరుకోలేదు. తర్వాత రిప్లే లో నాటౌట్ గా తేలింది. దాంతో డిఆర్ఎస్ కు వెళ్లందే నయ్యం అనుకున్నారు కావచ్చు నెదర్లాండ్స్. ఐదవ ఓవర్లు లో 3 వ బంతికి రోహిత్ ఫోర్ కొట్టాడు. రోహిత్, గిల్ మంచి భాగస్వామ్యం నెలకొల్పోలా కనిపిస్తున్నారు. లాస్ట్ బాల్ కి రోహిత్ మళ్ళీ ఫోర్ బాదాడు. 5 ఓవర్లు ముగిసే సారి కి స్కోర్ 37/0

వన్డే ప్రపంచకప్‌ భారత్ న్యూజిలాండ్ తో చివరి లీగ్ మ్యాచ్ ఈరోజు ఆడనుంది. ఇప్పటి వరకు టీమిండియా 8 మ్యాచ్ లు ఆడి 8 గెలిచి ఓటమనేది లేకుండా ముందుకు సాగుతుంది. ఈరోజు బెంగుళూరు లోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో రోహిత్ శర్మ టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పుడు అందరి దృష్టి విరాట్ కోహ్లీ 50వ సెంచరీపైనే ఉంది. దక్షిణాఫ్రికాపై చెలరేగినట్లే ఈ మ్యాచ్‌లోనూ ఆడితే కోహ్లీ అరుదైన మైలురాయిని అందుకోవడం కష్టమేం కాదు.

భారత్‌

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహమ్మద్‌ షమీ, బుమ్రా, కుల్‌దీప్ యాదవ్, సిరాజ్

నెదర్లాండ్స్‌

ఒదౌడ్‌, బారెసి, ఆకర్‌మ్యాన్‌, సిబ్రాండ్‌, ఎడ్వర్డ్స్‌ (కెప్టెన్/వికెట్ కీపర్), డి లీడ్‌, తేజ నిడమానూరు, వాన్‌ బీక్‌, వాండెర్‌మెర్వ్‌, ఆర్యన్‌ దత్‌, మీకెరన్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button