తెలుగు
te తెలుగు en English
మరిన్ని

Lepcha.. సరిహద్దులో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు

భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా హిందూవులు దీపావళి పండుగను (Diwali Festival) ఆనందోత్సాహాల మధ్య చేసుకుంటున్నారు. ప్రజలకు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రతి సంవత్సరం మాదిరి ఈ ఏడాది కూడా సైనికులతో (Soliders) దీపావళి పండుగ చేసుకున్నారు. సరిహద్దుల్లో దేశం కోసం పని చేస్తున్న సైనికుల్లో (Indian Army) స్థైర్యం నింపేందుకు మోదీ ప్రతి దీపావళిని వినియోగిస్తున్న విషయం తెలిసిందే. ఈ సంవత్సరం మరి మోదీ ఎక్కడ చేసుకున్నారో తెలుసా..?

Also Read అర్ధరాత్రి హైడ్రామా.. కాంగ్రెస్ శ్రేణులపై ఎమ్మెల్యే బాలరాజు దాడి

దీపావళి పండుగ చేసుకునేందుకు ప్రధాని మోదీ ఆదివారం హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లోని లేప్చా (Lepcha) సైనిక శిబిరానికి వెళ్లారు. సైనిక శిబిరాన్ని సందర్శించి సైనికులతో సరదాగా గడిపారు. వారి యోగాక్షేమాలు వాకబు చేసిన అనంతరం అక్కడి పరిస్థితులు తెలుసుకున్నారు. వారితో సరదాగా మాట్లాడి జోకులు వేసుకుని నవ్వుకున్నారు. ఈ సందర్భంగా సైనికులకు మిఠాయిలు (Sweets) పంచిపెట్టారు. సైనికులతో బాణసంచా కలిసి మోదీ సందడి చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సైనిక దుస్తుల్లో కనిపించారు. తన పర్యటనకు సంబంధించిన ఫొటోలను ఎక్స్ (ట్విటర్)లో ప్రధాని పంచుకున్నారు. ‘ధైర్యవంతులైన మన భద్రతా సిబ్బందితో కలిసి దీపావళి పండుగ చేసుకున్నా’ అని పోస్టు చేశారు. అంతకుముందు దేశ ప్రజలకు మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

Also Read  కాంగ్రెస్ కు బిగ్ బూస్ట్.. మైనార్టీ సంఘాల భారీ మద్దతు

పదేళ్లుగా ఇదే సంప్రదాయం
‘దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలోకి ఆనందాన్ని (Happiness), సమృద్ధిని, మంచి ఆరోగ్యాన్ని తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నా’ అని ఎక్స్ లో ప్రధాని మోదీ పోస్టు చేశారు. కాగా, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధాని ఈ కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించారు. 2014లో తొలిసారి సియాచిన్ లో సైనికులతో కలిసి మోదీ దీపావళి చేసుకోగా.. 2022లో కార్గిల్ (Kargil)లో చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button